మూవీ : బ్లడీ బెగ్గర్ (Bloody Beggar)
డైరెక్టర్: M.శివబాలన్
రైటర్: M. శివబాలన్
నిర్మాత: నెల్సన్
నటీనటులు: కవిన్, సునీల్ సుఖద, దివ్యా, విక్రమ్, రెడీన్ కింగ్ స్లే, పృద్వీ రాజ్ తదితరులు..
విడుదలతేదీ: 07- నవంబర్ – 2024
Bloody Beggar Movie Telugu Review
Bloody Beggar Review: తమిళ నటుడు కవిన్, తాజాగా “బ్లడీ బెగ్గర్” చిత్రంలో బిచ్చగాడు పాత్రలో నటించారు. “బ్లడీ బేగర్” ఒక విభిన్నమైన డార్క్ కామెడీ. ఈ చిత్రం దీపావళి సందర్భంగా తమిళంలో విడుదలైంది. అయితే, ఇప్పుడు (నవంబర్ 7) ఈ సినిమా తెలుగులోనూ థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఒక వైవిధ్యమైన హారర్ కామెడీగా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఈ చిత్రం ప్రేక్షకులను ఈమేరకు ఆకట్టుకుందో ఈ సమీక్షలో తెలుసుకుందాం. స్టార్, దాదా లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగులోనూ మోస్తరు గుర్తింపు తెచ్చుకున్నాడు కవిన్.
కథ: ఎంత కష్టపడినా ఫలితం దక్కదని భావించి బిక్షగాడుగా మారతాడు హీరో (కవిన్). వచ్చిన డబ్బులతో ఓ చిన్నపిల్లవాడితో కలిసి ఉంటూ బ్రతుకుతుంటాడు. అయితే ఓ రోజు ఓ పెద్ద ఇంట్లో బిచ్చగాళ్లకు భోజనాలు పెడుతున్నారని తెలిసి వెళతాడు. అక్కడ అనుకోకుండా ఇంట్లోకి వెళ్లి ఇరుక్కుపోతాడు. ఆ ఇంట్లో ఎవరు లేరన్న బిచ్చగాడికి ఆ ఇంట్లో ఓ లేడీ ఒకరిని మర్డర్ చేస్తూ కనిపిస్తుంది. అది చూసిన బిచ్చగాడు పారిపోవడానికి ప్రయత్నించి ఆ లేడీ కి దొరుకుతాడు. ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులు పదిమంది కూడా అతన్ని చంపడానికి ప్రయత్నించగా వారినుండి ఆ బిచ్చగాడు ఎలా తప్పించుకున్నాడు అనేదే సినిమా లోని మిగితా కథ.
విశ్లేషణ: బిచ్చగాడు సినిమా తమిళ్లో, తెలుగులో సూపర్ హిట్ కావడంతో ఆ నేపథ్యంతోనే వచ్చిన సినిమా బ్లడీ బెగ్గర్. ఈ సినిమాలో కవిన్ బిచ్చగాడు పాత్రతో అదరగొట్టాడు. ప్రారంభంలోనే బిచ్చగాడిగా తన పాత్ర తోప్రేక్షకులను అలరిస్తాడు. కవిన్ నటన ప్రతి సన్నివేశంలో ఎంతో ప్రత్యేకత చూపించింది. బిచ్చగాడు పాత్రలో కొన్ని సన్నివేశాలు చూస్తే మరింత ఎంటర్టైనింగ్‌గా అనిపిస్తాయి. ఆయన పాత్రకు సరిపోయే ఎంటర్టైన్మెంట్ అందించడం ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతుంది. ఇక చనిపోయిన నటుడి కొడుకు, కూతుళ్లు, మనవడు, మనవరాళ్లుగా నటించిన పాత్రధారులు కూడా అదరగొట్టారు. వారి నటనలోని అన్ని రకాల భావోద్వేగాలు సినిమాకు మరింత బలాన్ని చేకూర్చాయి. ముఖ్యంగా సునీల్ సుకంద కన్నింగ్ లాయర్ పాత్రలో నటించడం సినిమాకు హైలైట్. ఆయన కామెడీ సినిమాకు అదనపు బలం.
Also Read: Thaman: పెళ్లి ఒకరితో శోభనం మరొకరితో అంటూ సంచలన కామెంట్స్ చేసిన థమన్.?
ఒక సినిమాను ప్రేక్షకుడికి దగ్గర చేయడానికి, కథ ఎంత కొత్తగా ఉండాలో అంతకంటే ఎక్కువగా చెప్పే తీరు బాగుండాలి. ‘బ్లడీ బెగ్గర్’లో కథ ఎంతో వైవిధ్యంగా ఉంది. అంతేకాదు చాలా పాయింట్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇదే దర్శకుడు నెల్సన్‌ను ఈ ప్రాజెక్ట్‌కి ఆకర్షించిన అంశం అయి ఉండొచ్చు. కథ ఎంతో ఆసక్తి సాగుతూ, ప్రధాన సన్నివేశాలకు చేరిన తర్వాతమరింత ఆసక్తిగా ఉంటుంది. సినిమాలోని ఎమోషనల్ సీన్లు ఆకట్టుకునేలా చిత్రీకరించారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో వచ్చే భావోద్వేగ సన్నివేశాల్లో కవిన్ నటన నిజంగా మెప్పించగలిగింది. కొత్త దర్శకుడు శివబాలన్ ముత్తుకుమార్ పనితనంలో నెల్సన్ ప్రభావం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతీ సన్నివేశంలోనూ హీరోని క్లోజప్ షాట్లతో చూపించడం, సన్నివేశాలు తీసిన తీరే నెల్సన్ శైలిని గుర్తు చేస్తాయి. క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సీన్‌లో చిన్న పిల్లాడి నటన కూడా ఎంతో సహజంగా ఉంది, అది సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
సినిమాటోగ్రాఫర్ సుజిత్ సారంగ్ అందించిన విజువల్స్ సినిమాకు పెద్ద బలం. ఆయన అందించిన సినిమాటోగ్రఫీ సినిమా మొత్తం ఫ్రెష్ ఫీలింగ్‌ను కలిగిస్తాయి. జెన్ మార్టిన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ముఖ్యంగా, కీ సీన్లలో సంగీతం సినిమాకు బలాన్ని చేకూర్చింది.
ప్లస్ పాయింట్స్:
కవిన్ నటన
కథ, కథనాలు
సంగీతం
మైనస్ పాయింట్స్:
అక్కడక్కడా బోర్ కొట్టించే సన్నివేశాలు
తీర్పు: ‘బ్లడీ బెగ్గర్’ సినిమాకు మంచి కథ కథనం తో పాటు ప్రేక్షకులకు చేరవేసే విధానం కూడా బాగుంది. కవిన్ బిచ్చగాడి పాత్రలో ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సీన్లు బాగా పండాయి. కొత్త ఎక్స్పీరియెన్స్ కోసం ఈ సినిమా తప్పకుండ చూడాల్సిందే.
రేటింగ్: 3/5
టాగ్ లైన్: బ్లడీ బెగ్గర్.. డార్క్ కామెడీ ఎంటర్టైనర్