సినిమా: ఈ సారైనా (EeSaraina)
నటీనటులు: విప్లవ్, సంకీర్త్, ఆర్టిస్ట్ ప్రదీప్, అశ్విని ఆయలూరు, సాలార్ ఫేమ్ కార్తికేయ దేవ్, నటుడు మెహబూబా బాషా తదితరులు
దర్శకుడు: విప్లవ్.జి
సంగీతం: తేజ్
డీఓపీ: గిరి
ఎడిటింగ్: విప్లవ్
ఆర్ట్: దండు సందీప్ కుమార్
నిర్మాత: విప్లవ్
విడుదల తేదీ: 08 – నవంబర్ -2024
EeSaraina: విప్లవ్ ప్రధాన పాత్రలో స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘ఈసారైనా’. ఈ రోజే విడుదలైన ఈ సినిమాగ్రామీణ నేపథ్యంలో ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకోగా ఈ సినిమాలో అశ్విని, ప్రదీప్ రాపర్తి, మహబూబ్ బాషా తదితరులు నటించారు. తేజ్ సంగీతం అందించగా గిరి సినిమాటోగ్రఫీ సమకూర్చారు. దండు సందీప్ కుమార్ ఆర్ట్ డిజైన్ లో తెరకెక్కిన ఈ సినిమా కంటెంట్, ఎమోషన్లతో ఎలా ఆకట్టుకుందో తెలుసుకోవాలంటే ఈ సమీక్ష చూడాల్సిందే.
Viplav EeSaraina Movie Review
కథ: రాజు (విప్లవ్) డిగ్రీ పూర్తి చేసి నాలుగేళ్లు గడిచినా, ఉద్యోగం చేస్తే ప్రభుత్వ ఉద్యోగమే చేయాలి అన్నట్లుగా జీవితం సాగిస్తున్నాడు. తన ఊరిలోనే ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న శిరీష (అశ్విని)తో ప్రేమలో పడతాడు. అయితే, మూడు సార్లు నోటిఫికేషన్ వచ్చినా రాజు ఉద్యోగం సాధించలేకపోతాడు. అయినా, రాజుని అతని స్నేహితుడు మహబూబ్ బాషా, శిరీష ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. శిరీష తండ్రి (ప్రదీప్ రాపర్తి) మాత్రం “గవర్నమెంట్ జాబ్ వస్తేనే నా కూతుర్ని నీకు ఇస్తా” అని సవాల్ విసురుతాడు. చివరికి రాజు ప్రభుత్వ ఉద్యోగం సాధించి తన ప్రేమను గెలిచాడా? అనేదే ఈ సినిమా కథ.
Also Read: Prabhas Puri Jagannadh: పూరితో కలిసి పనిచేయనున్న ప్రభాస్.. ఏ సినిమా కోసం అంటే?
విశ్లేషణ: గవర్నమెంట్ ఉద్యోగం కోసం కష్టపడుతూనే తన ప్రేమను గెలుచుకోవాలనే తపనతో సాగే రాజు పాత్రలో విప్లవ్ అద్భుతంగా నటించారు. ఆయన నటన, ప్రతి ఒక్కరికి ఈ కథను మరింత దగ్గర చేస్తుంది. అశ్విని తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తూ, తన అభినయంతో ప్రేక్షకులను మెప్పిస్తుంది. ప్రదీప్ రాపర్తి, అశ్విని తండ్రి పాత్రలో, మహబూబ్ బాషా రాజు స్నేహితుడి పాత్రలో తమ నటనతో కథకు మరింత బలం చేకూర్చారు. చిన్నారులు సలార్ కార్తికేయ దేవ్, నీతు సుప్రజ తమ చిన్న పాత్రలతోనే ప్రేక్షకుల మనసు దోచుకుంటారు.
దర్శకుడు విప్లవ్, ప్రతి పాత్రను విభిన్నంగా మలచి, ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.హీరోగా, రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా, ఎడిటర్‌గా కూడా వ్యవహరించడం నిజంగా అభినందనీయం. ఈ చిత్రంలో గ్రామీణ జీవనం, ప్రేమ, స్నేహం, ఆశయాలు వంటి అనేక అంశాలను అద్భుతంగా కలిపి వెండితెరపై ఆవిష్కరించారు విప్లవ్. ఒక్కడే ఇన్ని బాధ్యతలు నిర్వహించి సినిమాను పూర్తి చేయడం చాలా కష్టమైన పని. దాన్ని సులువుగా చేశాడు. సినిమాటోగ్రఫీ, సంగీతం, సంభాషణలు ఈ సినిమాకు ప్రధాన బలాలుగా నిలిచాయి. గిరి కెమెరా పనితనం, తేజ్ సంగీతం చాలా బాగున్నాయి. సినిమాలోని ప్రతి దృశ్యం కూడా చక్కగా కనిపిస్తుంది. సంగీతం కథకు మరింత బలం చేకూర్చింది. నిర్మాణ విలువలు కూడా సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.
తీర్పు: మొత్తంగా, “ఈ సారైనా” ఒక చక్కటి ప్రయత్నం. మంచి ఎమోషన్, కంటెంట్ తో ఈ సినిమా మరింత ప్రేక్షకులకు దగ్గరవుతుంది. ప్రేమ కథలను ఇష్టపడే ప్రేక్షకులు ఈ సినిమాను ఆస్వాదించవచ్చు. విప్లవ్ తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన “ఈ సారైనా” చిత్రం, ఒక ఆహ్లాదమైన ప్రేమకథను అందంగా చూపించాడు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథ, ప్రేక్షకులను తమలో తాము తీర్చి చూసుకునేలా చేస్తుంది.
రేటింగ్: 3/5