appudo ippudo eppudo review

సినిమా : అప్పుడో ఇప్పుడో ఎప్పుడో
నటీనటులు:నిఖిల్,రుక్మిణి వసంత్,దివ్యాన్షా కౌశిక్,సత్య,సుదర్శన్,అజయ్ తదితరులు
దర్శకుడు: సుధీర్ వర్మ
నిర్మాతలు: నరసింహ చారీ చెన్నోజు, నరసబాబు, బీవీఎస్ఎన్ ప్రసాద్
సినిమాటోగ్రాఫర్: రిచర్డ్ ప్రసాద్
ఎడిటర్: నవీన్ నూలి
మ్యూజిక్: కార్తీక్, సన్నీ ఎంఆర్
బ్యానర్: ఎస్‌వీసీసీ, హైవే పిక్చర్స్ లిమిటెడ్, ఎల్ఎల్‌వీ
రిలీజ్ డేట్: 2024-11-08

Nikhil Siddharth in Appudo Ippudo Eppudo Movie Review

Appudo Ippudo Eppudo: నిఖిల్ హీరో గా నటించిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైనప్పటికీ షూటింగ్ అవాన్తరాలతో ఇటీవలే షూటింగ్ పూర్తయింది. చాలారోజులుగా విడుదలకు నోచుకుని ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఖరారు చేసుకుంది. ప్రమోషన్లు కూడా తక్కువగా నిర్వహించగా నేడు (నవంబర్ 08) థియేటర్లలో విడుదలైంది. కార్తికేయ సినిమాతో వంద కోట్ల క్లబ్ లో చేరిన హీరో నిఖిల్ సినిమాకి ప్రేక్షకులనుండి ఎలాంటి స్పందన వచ్చిందో తెలియాలంటే ఈ సమీక్షలో తెలుసుకుందాం..

కథ: హైదరాబాద్‌లో రేసర్ గా ఉన్న రిషి (నిఖిల్) తార (రుక్మిణి వసంత్)ను తొలిచూపులోనే ప్రేమిస్తాడు. ఆ క్రమంలో తార కూడా రిషి ని ప్రేమిస్తుంది. కానీ రిషి స్నేహితుడు (వైవా హర్ష) చేసిన తప్పు వల్ల వారిద్దరి ప్రేమ ఫలించదు. దాంతో రిషి లండన్ వెళ్ళిపోతాడు. అక్కడ తులసి (దివ్యాంశ) పరిచయం అవుతుంది, ఆమెతో ప్రేమలో పడిన రిషి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే, పెళ్లి ముహూర్తం సమయానికి తులసి కనిపించకుండా పోతుంది. ఆ తరువాత మళ్ళీ రిషి జీవితంలోకి తార ప్రవేశిస్తుంది. వారిద్దరి ప్రేమ ఈ సారి ఫలిస్తుందనేసరికి కనిపించకుండాపోయిన తులసి ఎంటర్ అవుతుంది. అసలీ తులసి ఎవరు..? రిషి జీవితంలోకి తరచు ఎందుకువస్తుంది.. వెళ్తుంది..తార,రిషి విడిపోవడానికి రిషి ఫ్రెండ్ చేసిన పొరపాటు ఏంటి అనేది తెలియాలంటే రివ్యూ లోకి వెళ్లాల్సిందే.

Also Read: Bloody Beggar : డార్క్ కామెడీ ఎంటర్టైనర్.. బ్లడీ బెగ్గర్ మూవీ రివ్యూ!!

విశ్లేషణ: పలు అవాంతరాల తర్వాత విడుదలైన నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించిన “అప్పుడో ఇప్పుడో ఎప్పుడో” సినిమా విడుదలై ప్రేక్షకులను మెప్పించింది. కార్ రేసింగ్ డ్రైవర్‌గా కనిపించిన నిఖిల్ మరోసారి ఆకట్టుకున్నాడు. ఈ పాత్ర నిఖిల్ లోని కొత్త నటనను ఆవిష్కరించింది.మంచి స్క్రీన్‌ప్లే , ఆసక్తికరమైన కథ నిఖిల్ పాత్రను మరింత ఆసక్తిపరిచింది.

ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన దివ్యాంశ కౌశిక్ తన అందంతో ప్రేక్షకులను ఎప్పటిలాగే అలరించింది. సప్తసాగరాలు దాటి సినిమాలో చేసిన హీరోయిన్ రుక్మిణి వసంత్ మరోసారి ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రేమకథ చిత్రం కావడంతో ప్రతి ఫ్రేమ్ ను అద్భుతంగా తీర్చిదిద్దాడు.కెమెరా వర్క్‌ చాలా బాగుంది. కథలోని సన్నివేశాలకు బలం మాటలు. దర్శకుడు మాటలు బాగా రాసుకున్నాడు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలు కూడా బాగున్నాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి. విదేశాల్లో చేసిన షూటింగ్ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి.

ఈ సినిమా క్లాసీగా ఉంటుంది. సత్య, సుదర్శన్, వైవా హర్ష వంటి నటులు చేసిన కామెడీ నవ్వించింది. నిఖిల్ కెరీర్‌లో ఇది ఒక మంచి సినిమా అవుతుందని చెప్పొచ్చు. మొత్తంగా చూస్తే, “అప్పుడో ఇప్పుడో ఎప్పుడో” సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయం అని చెప్పాలి. కొత్త కథ, మంచి స్క్రీన్‌ప్లే, మరియు బలహీనమైన ప్రదర్శనలు ఈ సినిమాను సగటు సినిమాగా మార్చాయి. నిఖిల్ సిద్ధార్థ్ అభిమానులు ఈ సినిమాపై ఎక్కువ ఆశలు పెట్టుకున్నప్పటికీ, వారి ఆశలు నెరవేరలేదు.

ప్లస్ పాయింట్స్:

నిఖిల్,రుక్మిణి వసంత ల కెమిస్ట్రీ

స్క్రీన్ ప్లే

ట్విస్ట్ లు

మైనస్ పాయింట్స్:

బాక్గ్రౌండ్ మ్యూజిక్

బోర్ కొట్టించే సన్నివేశాలు

తీర్పు: ప్రేమకథలు ఇష్టపడేవారికి ఈ సినిమా మంచి ఫీలింగ్ ని కలిగిస్తుంది. లండన్ లోని సీనరీ, రేసింగ్ దృశ్యాలు బాగుంటాయి. నిఖిల్ కెరీర్ లో ఇది కూడా ఓ మంచి సినిమా అవుతుంది.

రేటింగ్ : 2.75/5

https://twitter.com/pakkafilmy007/status/1854915347763106161