Sanju Samson: భారత క్రికెటర్ జట్టు స్టార్ బ్యాట్స్మెన్ సంజు శాంసన్ మంచి ఫామ్ కొనసాగిస్తున్నాడు. తన అద్భుతమైన బ్యాటింగ్ తీరుతో భారీగా పరుగులను చేస్తున్నాడు. సంజు శాంసన్ ఈ రోజున అంటే నవంబర్ 11వ తేదీన తన 30వ పుట్టినరోజు వేడుకను జరుపుకున్నాడు. మొదటి మ్యాచ్లో సెంచరీ చేయగా, రెండవ మ్యాచ్లో సంజు జీరోకే పెవిలియన్ చేరాడు. క్రికెట్ లో ఎన్నో విజయాలను సాధించిన సంజు శాంసన్ తన పర్సనల్ లైఫ్ లో కూడా సక్సెస్ అయ్యాడు. Sanju Samson
Sanju Samson Love Story
అతడు ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకొని మూడుముళ్ల బంధంలోకి అడుగు పెట్టాడు. సంజు శాంసన్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇతని ప్రేమకథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అందరిలానే సంజు శాంసన్ ప్రేమలో కూడా ఎన్నో ఒడిదొడుకులు, మలుపులు ఏర్పడ్డాయి. అతని భార్య పేరు చారులత. 2018లో చారులత, సంజు శాంసన్ వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ కేరళ వాసులు. ఇద్దరు మొదటిసారి మార్ ఇవానియోస్ కాలేజీలో కలుసుకున్నారు. మొదటి చూపులోనే సంజు శాంసన్ చారులతతో ప్రేమలో పడ్డాడు. చారులతతో మాట్లాడాలంటే మొదట్లో చాలా భయపడ్డారు. Sanju Samson
Also Read: Senior Indian Players: రోహిత్..కోహ్లీ.. అశ్విన్.. వీరిలో ఎవరికీ మూడిందో!!
అనంతరం ఫేస్బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టారు. అప్పటినుంచి స్నేహంగా ఏర్పడిన వీరి పరిచయం ప్రేమగా మలుపు తిరిగింది. క్రమక్రమంగా వీరిద్దరూ ఫేస్బుక్ లో మాట్లాడుకోవడం ప్రారంభించిన అనంతరం వీరి స్నేహం ప్రేమగా మారింది. ఆ తర్వాత వీరు వివాహానికి ముందు ఐదు సంవత్సరాల పాటు ఒకరితో ఒకరు డేటింగ్ చేసుకున్నారు. సంజు శాంసన్ క్రిస్టియన్ కాగా, చారులత హిందూ నాయర్. వీరిద్దరూ కుటుంబ సభ్యులను ఒప్పించిన అనంతరం డిసెంబర్ 22, 2018న కోవలంలోని ఓ రిసార్ట్ లో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ సంతోషంగా వారి లైఫ్ ను కొనసాగిస్తున్నారు. Sanju Samson