Vikarabad Collector Attacked: కొడంగల్ నియోజకవర్గం లో… అధికారులపై దాడి జరిగిన సంఘటన దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. కొడంగల్ నియోజకవర్గంలో… ఫార్మాసిటీ నిర్మిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం దాదాపు 1400 ఎకరాల రైతుల భూములను… తీసుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. Vikarabad Collector Attacked
Vikarabad Collector Attacked Update
దీంతో కొడంగల్ నియోజకవర్గం లో ఉన్న దాదాపు నాలుగు గ్రామాల ప్రజలు, రైతులు ఏకమై దీన్ని వ్యతిరేకిస్తున్నారు. మాకు ఏ ఫార్మాసిటీ వద్దని… మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి అంటూ నిరసనలు తెలుపుతున్నారు. అయితే ఈ భూముల పైన సర్వే చేసేందుకు తాజాగా.. వికారాబాద్ జిల్లా కలెక్టర్, స్థానిక అధికారులందరూ.. సోమవారం రోజున కొడంగల్ నియోజకవర్గానికి వెళ్లారు. Vikarabad Collector Attacked
Also Read: Chandrababu: వైసిపి నేతల భార్యలు అలాగే కూతుర్లను కాపాడేందుకు రంగంలోకి చంద్రబాబు ?
దీంతో రైతులందరూ ఏకమై వారిపై దాడి చేయడం జరిగింది. అయితే ఈ దాడి చేసింది గులాబీ పార్టీ నేత పట్నం నరేందర్ రెడ్డి..అంటూ కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు.కలెక్టర్ పైన దాడి చేసిన వ్యక్తి.. పట్నం నరేందర్ 42 సార్లు ఫోన్ చేశాడట.ఈ డాటా ను బయటపెట్టి కాంగ్రెస్ నిలదీస్తోంది. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. Vikarabad Collector Attacked