YCP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో… వైసిపి నేతలపై కేసుల పరంపర కొనసాగుతోంది. 2014 నుంచి తెలుగుదేశం పార్టీ నేతలపైన అలాగే జనసేన నేతలపైన పోస్టులు పెట్టిన వారి పైన కూడా ఇప్పుడు కేసులు పెడుతున్నారు. 41 సిఆర్పిఎఫ్ నోటీసులు ఇచ్చి మరి… అరెస్టు చేయడం జరుగుతుంది. కొంతమందికి లుక్ అవుట్ నోటీసులు ఇచ్చి… టిడిపి కూటమి ప్రభుత్వం రచ్చ చేస్తుంది. YCP
YCP strong Warning To AP Polices
అయితే ఇలా వైసీపీ కార్యకర్తలను వేధించడం పైన… మాజీ మంత్రి పేర్ని నాని స్పందించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు అరాచకంగా వ్యవహరిస్తున్నారని పేర్ని నాని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు. ఏపీ పోలీసులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించి వైసిపి నేతలను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. YCP
Also Read: Chandrababu: వైసిపి నేతల భార్యలు అలాగే కూతుర్లను కాపాడేందుకు రంగంలోకి చంద్రబాబు ?
అలాంటి పోలీసులు అందరి పేర్లను రాసుకుంటున్నట్లు తెలిపారు. ఇలా పోలీసులు అరబ్ కంట్రీలలో వ్యవహరిస్తే ఉరితీస్తారని హెచ్చరించారు. ఇప్పుడు ఏపీ పోలీసులను.. అలా చేసిన తప్పు లేదన్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏపీ పోలీసులు ఉండాలంటూ వార్నింగ్ ఇచ్చారు పేర్ని నాని. YCP