Naga Chaitanya: అక్కినేని కుటుంబంలో అత్యంత పేరు సాధించిన హీరోల్లో నాగేశ్వర్ రావు, నాగార్జున ఉన్నారు. అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ఇప్పటికి సినిమాల్లో తన స్టార్ డం కాపాడుకుంటూ దూసుకుపోతున్నారు. ఆయన వారసులుగా ఎంట్రీ ఇచ్చినటువంటి నాగచైతన్య, అఖిల్ లు మాత్రం ఇండస్ట్రీలో ఓ స్థాయికి ఎదగలేక పోతున్నారు. అఖిల్ హీరోగా పూర్తిగా డల్ అయిపోయాడు.
Naga Chaitanya has a very bad habit
ఇక నాగచైతన్య రెండు సినిమాలు హిట్ అయితే మరో నాలుగు సినిమాలు ఫ్లాప్ అనే విధంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఆయన సినిమా కెరియర్ ఇలా ఉంటే వ్యక్తిగత జీవితంలో కూడా అనేక ఒడిదుడుకులు ఉన్నాయి. నాగచైతన్య హీరోయిన్ సమంతను పెళ్లి చేసుకుని విడాకుల ద్వారా విడిపోయాడు. ఆ తర్వాత శోభిత ధూళిపాళ్లతో లవ్ లో పడి సీక్రెట్ గా వారి లవ్ ను మెయింటైన్ చేసి కొన్ని నెలల కిందట ఇరు కుటుంబాలను ఒప్పించి ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. త్వరలోనే వీరి పెళ్లి కూడా కాబోతోంది.(Naga Chaitanya)
Also Read: Pushpa 2: పుష్ప 2 .. కోసం పుష్ప 1 ను బాగానే వాడుతున్నారు గా!!
అలాంటి ఈ తరుణంలో నాగచైతన్యకు సంబంధించినటువంటి ఒక వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. పైకి ఎంతో సైలెంట్ గా కనిపించే నాగచైతన్యకు ఒక అలవాటు ఉంది. ఎంతో సైలెంట్ గా కనిపించే నాగచైతన్య ఏదైనా బాధ కలిగినా..ఎక్కువ సంతోషం కలిగినా.. విపరీతంగా డ్రింక్ చేస్తారట. అదికూడా ఎవ్వరూ లేని సీక్రెట్ ప్రదేశం కి వెళ్లి బాగా తాగి గట్టిగా అరుస్తూ తన బాధను ఎమోషనల్ గా బయటపెట్టుకుంటారట.
అంతేకాదు బాగా తాగిన తర్వాత ఎవరికైనా ఫోన్ చేసి తన నోటికి వచ్చినట్లు మాట్లాడతారట.. ఇందులో ఎంతవరకు నిజం ఉందో అబద్ధం ఉందో తెలియదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త విపరీతంగా వైరల్ అవుతుంది.దీంతో చాలామంది నెటిజన్స్ అందుకే సమంత దూరమైంది కావచ్చు..మరి శోభిత పరిస్థితి ఎలా ఉంటుందో అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Naga Chaitanya)