సినిమా: కంగువ (Kanguva Review)
నటీనటులు: సూర్య, దిశా పటాని, యోగి బాబు, బాబీ డియోల్ తదితరులు
నిర్మాతలు: కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్
దర్శకత్వం: శివ
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
కో ప్రొడ్యూసర్: నేహా జ్ఞానవేల్ రాజా
రిలీజ్ డేట్: 2024-11-14

Kanguva Review: సూర్య భారీ యాక్షన్‌..విజువల్ మేజిక్.. “కంగువ” మూవీ రివ్యూ!! తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్న హీరో సూర్య. అయన హీరో గా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం ‘కంగువ’.దిశా పటాని, యోగి బాబు, బాబీ డియోల్ అగ్రనటులు నటించిన ఈ సినిమా కి ప్రముఖ దర్శకుడు శివ దర్శకత్వం వహించారు. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుందో ఈ సమీక్షలో తెలుసుకుందాం.

కథ: ఫ్రాన్సిస్ (సూర్య) పోలీసులు కూడా పెట్టుకోలేని క్రిమినల్స్ ను పట్టుకుని అప్పజెబుతుంటాడు. అతనితో పాటు ఏంజెల్ (దిశాపటాని) అదే పని చేస్తుంటాడు. రెండు వేరు వేరు గ్యాంగ్ లు గా ఉన్న వీరు ఒకప్పుడు ప్రేమికులు. విడిపోతారు. అయితే ఓ సారి ఓ కేసు నిమిత్తం ఒకరిని చంపేయాల్సి వస్తుంది ఫ్రాన్సిస్. అది ఓ చిన్నపిల్లాడు చూస్తాడు. అతన్ని చూడగానే ఫ్రానీస్ కి ఎక్కడో కలిసిన ఫీలింగ్. ఆ పిల్లాడిని ఓ గ్యాంగ్ వెంటాడుతుంది. అసలు ఆ గ్యాంగ్ ఎవరు? ఈ చిన్న పిల్లాడిని ఎందుకు వెంటాడుతున్నారు.? వీరికి 1100 వ కాలానికి చెందిన కంగువ (సూర్య) కి ఏం సంబంధం అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

నటీనటులు: ఈ సినిమా లో సూర్య నటన హైలైట్. ఆయన ‘వన్ మ్యాన్ షో’ అని చెప్పవచ్చు.ఫ్రాన్సిస్, కంగువ పాత్రల్లో ఆయన ఒదిగిన తీరు చాలాబాగుంది. హీరోయిన్ పాత్రలో దీశా పటాని ఉన్నది కొద్దీ సేపే అయినా తన అందాలతో బాగానే అలరించింది. యాక్షన్ సీన్లు, ఎమోషన్ సీన్లలో తన అభినయంతో సినిమాకు ప్రాణం పోశాడు. పాత్రలు విభిన్నంగా ఉన్నప్పటికీ, సూర్య తన అనుభవంతో వాటిని చాలా బాగా పోషించాడు. బాబీ డియోల్ మరోసారి క్రూరమైన విలన్‌గా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. దర్శకుడు ఈ పాత్రను బాగా ఎలివేట్ చేశాడు. ఈ సినిమాలో వీరి తర్వాత ఓ బాలనటుడు తన నటనతో ఆకట్టుకున్నాడు. మిగిలిన పాత్రల్లో నటించిన వారు తమ స్థాయిలో మంచి నటన ప్రదర్శించారు, అయితే ప్రధానంగా కథ సూర్య చుట్టూ తిరుగుతుండడంతో, ఇతర పాత్రలకు పెద్దగా ఆస్కారం లేకుండా పోయింది.

సాంకేతిక నిపుణులు: సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలు కలిగిన చిత్రం కంగువ. కథా పరంగా డైరెక్టర్ శివ కృషి చాలా ఉంది. ముఖ్యమైన ఎపిసోడ్లలో శివ డైరెక్షన్ అద్భుతంగా ఉంది. సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ గురించి తప్పకుండా మాట్లాడాల్సిందే. నేపథ్య సంగీతం కొన్ని చోట్ల గూస్‌బంప్స్ ని ఇస్తుంది. సినిమాటోగ్రాఫర్ వెట్రి పళనిస్వామి విజన్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. రిచ్ విజువల్స్‌తో సినిమాను మరింత ఆకర్షణీయంగా మార్చాడునిర్మాతలు జ్ఞానవేల్ రాజా సారథ్యంలో స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్ భారీగా ఖర్చు పెట్టారు, దాని ప్రభావం తెరపై సుస్పష్టంగా కనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్:

సూర్య నటన

యాక్షన్ ఎపిసోడ్స్

నేపథ్య సంగీతం

మైనస్ పాయింట్స్ :

కథనం కొంత గందరగోళంగా ఉండడం

తీర్పు: జాతి, ప్రాంతాల మధ్య ఆధిపత్య పోరాటం నేపథ్యంగా ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో గ్రాండ్‌గా తెరకెక్కించారు. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులను ఆకట్టుకునే యాక్షన్ సన్నివేశాలు ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయి. మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్‌ను కోరుకునే వారికి ఈ వారం ‘కంగువ’ మంచి సినిమా అవుతుంది.

రేటింగ్: 3.5/5

టాగ్ లైన్: భారీ యాక్షన్‌..విజువల్ మేజిక్..