Cm Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే వయసును 21 సంవత్సరాలకు తగ్గించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో విద్యార్థుల మాకు అసెంబ్లీ సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ఎన్నికల్లో పోటీ చేసే వయసు పై కీలక వ్యాఖ్యలు చేశారు. Cm Revanth Reddy

Cm Revanth Reddy Comments On Elections

గతంలో ఓటు వేసే హక్కును 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించుకున్నామని గుర్తు.. చేశారు రేవంత్ రెడ్డి. ప్రస్తుతం 25 సంవత్సరాలు ఉంటేనే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత ఉంది.. దాన్ని 21 సంవత్సరాలకు తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. శాసన సభలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలు, సమాధానాలు… ఇతర అంశాలను విద్యార్థులు గమనించాలని కోరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. Cm Revanth Reddy

Also Read: KCR: కొడంగల్ కు ఉద్యమ నేత కేసీఆర్?

విపక్షాలు ప్రశ్నించడం, ప్రభుత్వాన్ని నిలదీయడం వారి బాధ్యత అన్నారు. లీడర్ ఆఫ్ ది హౌస్, లీడర్ ఆఫ్ ది అపొజిషన్ ఇద్దరికీ సమాన అవకాశాలు ఉంటాయని తెలిపారు. సభను సమర్ధవంతంగా నడిపే బాధ్యత స్పీకర్ పై ఉంటుందని వివరించారు రేవంత్ రెడ్డి. విపక్షాలు ఆందోళన చేసినా ప్రభుత్వం సమన్వయంతో సభను నడిపించేలా చూడాలని కోరారు. Cm Revanth Reddy