Shikhar Dhawan – NPL 2024: టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ క్రికెట్ మైదానంలోకి అడుగు పెట్టడానికి రెడీ అయ్యాడు. ఈ సంవత్సరం ఆగస్టు నెలలో అన్ని ఫార్మాట్ ల క్రికెట్ కు శిఖర్ ధావన్ వీడ్కోలు చెప్పిన సంగతి తెలిసిందే. అనంతరం ధావన్ భారత్ వేదికగా జరిగిన లెజెండ్స్ క్రికెట్ టోర్నీలో గుజరాత్ జెయింట్స్ కు సారథ్యం వహించాడు. Shikhar Dhawan – NPL 2024
Shikhar Dhawan joins Karnali Yaks for Nepal Premier League 2024
ఇప్పుడు మరో ఫ్రాంచైజీ క్రికెట్ టోర్నీలో ఆడడానికి శిఖర్ ధావన్ ఒప్పందం చేసుకున్నాడు. నేపాల్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ సీజన్ లో ఈ ఢిల్లీ ఆటగాడు ఓ భాగం కానున్నాడు. నేపాల్ ప్రీమియర్ లీగ్-2024లో కర్నాలీ యాక్స్ ఫ్రాంచైజీకి ధావన్ ప్రాతినిధ్యం వహించనున్నాడు. కాగా, ధావన్ టీ20ల్లో అరుదైన రికార్డులు నెలకొల్పాడు. టీ20ల్లో అతడు 9,797 పరుగులు చేశాడు. ఐపీఎల్ లో కూడా అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ధావన్ రెండవ స్థానంలో నిలిచాడు. Shikhar Dhawan – NPL 2024
Also Read:
ఇక ఐపీఎల్ విషయానికి వస్తే…. ఈ లీగ్ లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాయి. కర్నాలీ యాక్స్ తో పాటు బిరత్ నగర్ కింగ్స్, జనక్పూర్ బోల్ట్స్, చిత్వాన్ రైనోస్, లుంబిని లయన్స్, ఖాట్మండు గుర్కాస్, పోకరా ఎవెంజర్స్, సుదుర్పాస్చిమ్ రాయల్స్ మిగతా ఏడు జట్లు ఉన్నాయి. ఈ లీగ్ నవంబర్ 30 నుంచి డిసెంబర్ 21 వరకు జరగనుంది. Shikhar Dhawan – NPL 2024