Pawan Kalyan: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘పుష్ప 2: ది రూల్’ విడుదలకు సన్నాహాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం 2024 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ, ఇటీవల ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న ప్రముఖ టాక్ షో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే’ సీజన్‌లో ఆయన ప్రత్యేక అతిథిగా పాల్గొని ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. బాలకృష్ణ హోస్ట్‌గా ఉన్న ఈ షో ఎపిసోడ్ చాలా సెన్సేషన్ అవగా, దీనిపై భారీ స్పందన వచ్చింది.
Allu Arjun Praises Pawan Kalyan for His Courage and Unique Decisions
షోలో భాగంగా బాలకృష్ణ అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ గురించి ప్రశ్నించగా, అర్జున్ ఆయనపై తన అభిప్రాయాలను వ్యక్తపరిచాడు. పవన్ కళ్యాణ్‌ని తన ధైర్యసాహసాల కోసం ఇష్టపడతానని చెప్పాడు. తన జీవితంలో చాలామంది రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలను చూశానని, కానీ కేవలం పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే ఇంత ప్రత్యేకంగా భావిస్తానని చెప్పారు. ఆయనలోని సాహసం, ధైర్యం ఆయనను అందరిలోనూ ప్రత్యేకంగా నిలిపాయని, పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాలు ఎల్లప్పుడూ మిగతా వారికంటే విభిన్నంగా ఉంటాయని అన్నాడు. ఈ వ్యాఖ్యలు అక్కడున్న ప్రేక్షకుల అశ్చర్య పరచగా అభిమానులు ఎంతో హర్షం వ్యక్తం చేశారు.
Also Read: Winter Tips: చలికాలంలో దగ్గు, జలుబు రాకుండా ఈ టిప్స్ పాటించండి ?
ఈ ఎపిసోడ్ ఆహా ఓటీటీలో అందుబాటులో ఉంది, అందులో అల్లు అర్జున్ తన వ్యక్తిగత జీవితంపై, ప్రొఫెషనల్ ప్రయాణంపై, పవన్ కళ్యాణ్ సహా పలు ఆసక్తికర విషయాలపై మాట్లాడారు. పవన్ కళ్యాణ్‌పై అర్జున్ చూపిన గౌరవం, ఆయన మాటల్లోని అనుభూతి అభిమానులకు కనెక్ట్ అవగా, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ మధ్య ఉన్న అనుబంధం అందరికీ నచ్చింది. ఇలా మెగా ఫ్యామిలీ హీరోలు ఒకే వేదికపై ఒకరిపై ఒకరు చూపించిన గౌరవం అభిమానుల్లో సంతోషాన్ని కలిగించింది.
‘పుష్ప 2’ విడుదలకు ముందు ఈ ఎపిసోడ్‌లో పాల్గొనడం ద్వారా అల్లు అర్జున్ అభిమానుల హృదయాలను దోచుకున్నాడు. అతని పర్సనాలిటీ, అతని మాటల్లోని మర్యాదా ఈ ఎపిసోడ్ కే హైలైట్‌గా నిలిచాయి. బన్నీ మరికొన్ని ప్రాజెక్టులపై కూడా మెంటైన్ చేసిన సస్పెన్స్ ఈ ఎపిసోడ్‌తో కలిసిపోవడంతో అభిమానుల్లో మరింత ఆసక్తిని రేపింది. అల్లు అర్జున్ తన సరికొత్త సినిమా ప్రచారంలో భాగంగా ఈ షోలో పాల్గొనడం మాత్రమే కాకుండా, ఆయన వ్యక్తిత్వాన్ని, కుటుంబ సభ్యులపట్ల అతని గౌరవాన్ని చాటి చెప్పాడు. అభిమానులు కూడా ఈ ఎపిసోడ్‌ను ఆసక్తిగా వీక్షిస్తున్నారు.