Bunny: తెలుగు ఇండస్ట్రీలో మెగా అల్లు ఫ్యామిలీలు ఎంతో దగ్గరి బంధువులు. కానీ వీరి మధ్య ఎప్పుడు ఏదో ఒక వివాదం కొనసాగుతూనే ఉంటుంది. ఈ రెండు ఫ్యామిలీల మధ్య చీమ చీటుక్కుమన్నా అది సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో సెన్సేషనల్ వార్తగా మారుతుంది. గత ఎలక్షన్స్ సమయంలో అల్లు ఫ్యామిలీకి మరియు మెగా ఫ్యామిలీకి మధ్య విపరీతమైనటువంటి ఫైట్ జరిగింది. ఫ్యామిలీ మొత్తం టిడిపి, జనసేనకి సపోర్టుగా నిలిస్తే అల్లు అర్జున్ మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సపోర్టుగా నిలిచారు.
Bunny Sensational comments on Pawan Kalyan
దీంతో రెచ్చిపోయినటువంటి నాగబాబు అల్లు అర్జున్ పై ఇండైరెక్టుగా కౌంటర్ వేశాడు. ఆ టైంలో అది పెద్ద న్యూస్‌గా మారింది. కానీ ఎన్ని వివాదాలు ఉన్నా వారి ఇండ్లలో ఏదైనా ఫంక్షన్లు జరిగితే మాత్రం అందరూ కలిసి వెళ్తారు. రాజకీయాలను సినిమాలను ఇంటి గడప వద్దే వదిలేసి ఇరు కుటుంబాలు ఏ పండుగ జరిగినా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అలాంటి ఈ తరుణంలో తాజాగా అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె కార్యక్రమానికి హాజరైనటువంటి అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గురించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేశాడు.(Bunny)
Also Read: Kavya Kalyan Ram: బలగం బ్యూటీకి బంపర్ ఆఫర్..స్టార్ సెలబ్రిటీ ఇంటికి కోడలుగా..?
కొన్ని ఫోటోలను చూపిస్తూ మీ అభిప్రాయం చెప్పాలని అడిగారు. దీనిలో భాగంగానే పవన్ కళ్యాణ్ ఫోటో చూపించి మీ అభిప్రాయం చెప్పండి అని అడగగానే అల్లు అర్జున్ నవ్వుతూ పవన్ కళ్యాణ్ గారు చాలా ధైర్యవంతుడు. ఆయనంటే నాకు ఎంతో ఇష్టం. నేను సమాజంలో బిజినెస్ ఇండస్ట్రీలో ఉండే వారిని ఎంతో దగ్గర నుంచి చూసాను.
కానీ వారందరిలోకెల్లా అత్యంత ధైర్యం కలిగిన వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉంటారు. ఆయన ధైర్యం నాకెంతో ఇష్టం అంటూ చెప్పుకొచ్చాడు. దీనికి బాలకృష్ణ నవ్వుతూ అవును నిజమే అంటూ అన్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై అభిమానులు ఎవరికి నచ్చిన విధంగా వారు కామెంట్లు పెడుతున్నారు.(Bunny)