Ameesha Patel love with a boy 20 years younger than him

Ameesha Patel: సినీ ఇండస్ట్రీలో ఉండే వారికి ఏజ్ తో సంబంధం లేకుండా ప్రేమలు, పెళ్లిళ్లు జరుగుతూ ఉంటాయి. అంతేకాదు చాలామంది హీరోయిన్లు 50 సంవత్సరాల ఏజ్ వచ్చినా కానీ కుర్రాళ్ళతో గడపాలని అనుకుంటారట. ముఖ్యంగా కొంతమంది హీరోయిన్లకంటే దాదాపు 20 ఏళ్ల చిన్నవాళ్ళైన వారిని కూడా పెళ్లి చేసుకుంటూ ఉంటారు. అయితే తాజాగా అమీషా పాటేల్ కూడా ఇదే తోవలో ప్రయాణిస్తుంది. మరి ఆమె ఎవరితో లవ్ లో పడింది ఆ వివరాలు ఏంటో చూద్దాం..

Ameesha Patel love with a boy 20 years younger than him

ఒకప్పుడు ఇండియాలో స్టార్ హీరోయిన్లలో అమీషా పటేల్ కూడా ఒకరు. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అలా సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే బాలీవుడ్ డైరెక్టర్ అయినటువంటి విక్రమ్ బట్ తో లవ్ లో పడింది. అధికారికంగా ఈ విషయాన్ని బయట పెట్టింది. వీరి మధ్య ఏం పుట్టిందో ఏమో వీరి ప్రేమ కథ దాదాపు 5 సంవత్సరాల తర్వాత స్వస్తి చెప్పేసారు. (Ameesha Patel)

Also Read: Shivani Rajashekhar: ప్రియుడితో అమెరికాలో ఎంజాయ్ చేస్తున్న రాజశేఖర్ కూతురు.?

ఆ తర్వాత అమీషా పటేల్ మరో ఎన్నారైతో ప్రేమ వ్యవహారం నడిపిస్తోందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె వయసు 49 ఏళ్లు దాటి 50 ఏళ్లకు చేరబోతోంది. ఈ బ్యూటీ 30 ఏళ్ల యువకుడితో దుబాయిలో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అతని కౌగిలిలో బందీ అయిపోయి తన పరవశాన్ని ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసింది.

Ameesha Patel love with a boy 20 years younger than him

దాదాపు వీరి మధ్య 20 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉన్నా కానీ అతగాడితో ఈమె ఎంజాయ్ చేస్తూ వస్తోంది. ఇంతకీ ఆయన ఎవరయ్యా అంటే ఒక ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందినటువంటి నీరవ్ బిర్లా అని పేరు వినిపిస్తోంది. ఆయనకు వ్యాపారం ద్వారా వచ్చిన పేరు కంటే ఈమెతో లవ్ లో పడ్డ తర్వాత వచ్చిన పేరే ఎక్కువ అని పలువురు కామెంట్లు పెడుతున్నారు.(Ameesha Patel)