CM Chandrababu Naidu Targets 20 Lakh Jobs with Rs 30 Lakh Crore Investment

ChandraBabu: ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన పాలసీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సభా ముఖంగా కీలక ప్రకటనలు చేశారు. 2047 నాటికి దేశంలోనే ఏపీ నెంబర్ వన్ స్థానంలో నిలవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అందుకు అనుగుణంగా అభివృద్ధి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. “ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త” అనే ఆశయాన్ని సాకారం చేస్తామని, రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవానికి బాటలు వేస్తున్నట్లు ప్రకటించారు.

CM Chandrababu Naidu Targets 20 Lakh Jobs with Rs 30 Lakh Crore Investment

ప్రస్తుత ప్రభుత్వ లక్ష్యం రూ.30 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించి, 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడమేనని చంద్రబాబు వివరించారు. పెట్టుబడులు సమర్థంగా వినియోగం అయ్యేందుకు ప్రత్యేక వ్యవస్థను తీసుకురావడం ద్వారా, ప్రాజెక్టులు నిర్దేశిత కాలంలోనే పూర్తి చేయగలమని తెలిపారు. ముఖ్యంగా ఎంఎస్ఎంఈ రంగంలో భారీ స్థాయి పెట్టుబడులు సమకూర్చి, రూ.50 వేల కోట్ల పెట్టుబడులతో రాష్ట్రాన్ని సుస్థిరత వైపు నడిపించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు.

Also Read: Pawan Kalyan: పవన్ పై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పుష్పరాజ్!!

ఏపీని గ్లోబల్ ఉత్పత్తి కేంద్రంగా మార్చేందుకు ప్రత్యేక పథకాలను అమలు చేస్తామని, ఈ విధానంలో రూ.83 వేల కోట్ల విదేశీ పెట్టుబడులను కూడా ఆకర్షించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. 2024 నుండి 2029 వరకూ ఈ పథకాలు నిరంతరం అమల్లో ఉండేలా అవసరమైన అన్ని చర్యలు చేపడతామని వెల్లడించారు. ప్రతి నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలన్న సంకల్పాన్ని తెలియజేశారు. వీటిని ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంలో చేపట్టడం ద్వారా, ఆర్థికాభివృద్ధి వేగవంతమవుతుందని చెప్పారు.

రాష్ట్ర అభివృద్ధి కోసం పోర్టు ఆధారిత పరిశ్రమలను అభివృద్ధి చేసి, ఉపాధి అవకాశాలు కల్పించడానికి కొత్త విధానాలను ప్రవేశపెడుతున్నట్లు వివరించారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సహాయంతో పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అమరావతి, విశాఖపట్నం, రాజమండ్రి వంటి నగరాల్లో ఇన్నోవేషన్ హబ్‌లను ఏర్పాటుచేయడం ద్వారా సాంకేతిక పరిజ్ఞానానికి అవసరమైన వనరులు సమకూరుస్తామని, విజయవాడ, తిరుపతి, అనంతపురం నగరాల్లో టాటా ఇన్నోవేషన్ హబ్‌లను స్థాపించనున్నట్లు తెలిపారు.

డ్రోన్ టెక్నాలజీలో కూడా భారీ పెట్టుబడులు పెడుతూ, కర్నూలు జిల్లాలో 300 ఎకరాల విస్తీర్ణంలో డ్రోన్ సిటీని స్థాపించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చంద్రబాబు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ డిడీ పథకంలో భాగంగా డ్వాక్రా మహిళలకు డ్రోన్ పైలెట్ శిక్షణ అందించాలని ప్రణాళిక సిద్ధం చేశామని, వ్యవసాయ రంగంలో 10,000 మందికి పైగా మహిళలకు డ్రోన్ శిక్షణ ఇచ్చేలా సిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీలో భాగంగా ప్రతి ఉత్పత్తికి క్లస్టర్ ఏర్పాటుతో పాటు, పండించే పంటలకు విలువ జోడించడం ద్వారా ఏపీని ప్రపంచానికే “ఫ్రూట్ బాస్కెట్”గా మార్చేందుకు కృషి చేస్తున్నామని చంద్రబాబు వివరించారు.