Keerthy Suresh: కీర్తి సురేష్.. మహానటి సావిత్రి బయోపిక్ గా తెరకెక్కిన మహానటి మూవీతో ఇండియా మొత్తం మహానటి పేరుతో సుపరిచితురాలైన కీర్తి సురేష్ మహానటి కంటే ముందు రెండు మూడు సినిమాలు చేసినా కూడా అంత వర్కవుట్ అవ్వలేదు.కానీ మహానటి మూవీ ఈమె జీవితాన్ని మార్చేసింది అని చెప్పుకోవచ్చు. అలాంటి ఈ ముద్దుగుమ్మ గురించి గత వారం రోజుల నుండి పెళ్లి వార్తలు వినిపిస్తున్నాయి.
Keerthy Suresh marriage confirmed
కీర్తి సురేష్ తన చిన్ననాటి స్నేహితుడు అయినటువంటి ఆంటోనీ తటిల్ ని పెళ్లి చేసుకోబోతుందని, వీరి పెళ్లి డిసెంబర్ 11 జరగబోతుందని వార్తలు వినిపించాయి. అయితే చాలామంది ఇది రూమర్ అని కొట్టిపారేశారు. కానీ తాజాగా రెడ్డీట్ లో కీర్తి సురేష్ తండ్రి మాట్లాడిన మాటలను బట్టి కీర్తి సురేష్ పెళ్లి కన్ఫర్మ్ అయిందని అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది.. (Keerthy Suresh)
Also Read: Hero: వావ్..వాటే సర్ప్రైజ్..తండ్రి కాబోతున్న టాలీవుడ్ హీరో..?
గోవాలోని ఓ పెద్ద రిసార్ట్ లో ఆంటోని తటిల్ కీర్తి సురేష్ ల వివాహం జరగబోతుంది అని అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేశారు కీర్తి సురేష్ తండ్రి జి.సురేష్ కుమార్ .. ఇక తండ్రి క్లారిటీతో కీర్తి సురేష్ అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. నిజంగానే కీర్తి సురేష్ పెళ్లాడబోతుందని అందరూ ఓ క్లారిటీ కి వచ్చారు.ఇక వీరి పెళ్లి 11 లేదా 12న జరగబోతుందని సమాచారం.
ఏది ఏమైనప్పటికీ కీర్తి సురేష్ పెళ్లి వార్తలకు కీర్తి సురేష్ తండ్రి జి.సురేష్ కుమార్ గుడ్ న్యూస్ చెప్పి అందరి నోళ్లు తీపి చేశారని మహానటి కీర్తి సురేష్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు కీర్తి సురేష్ తన బాయ్ ఫ్రెండ్ ఆంటోనీ తటిల్ తో కలిసి ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది.(Keerthy Suresh)