Sobhita: శోభిత దూళిపాళ్ల ప్రస్తుతం తెలుగు ప్రజల్లో ఈమె తెలియని వారు ఉండరు. సినిమాల ద్వారా తక్కువ పేరు వచ్చిన కానీ, ఎప్పుడైతే అక్కినేని ఇంట్లోకి కోడలుగా రావడానికి ఫిక్స్ అయిపోయిందో అప్పటినుంచి ఈమె పేరు మరింత మార్మోగిపోతోంది. అలాంటి శోభిత గత కొన్ని సంవత్సరాలుగా నాగచైతన్యతో డేటింగ్ చేస్తూ వస్తోంది. చివరికి ఇరు కుటుంబాలను ఒప్పించి వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకొని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోవడానికి రెడీ అవుతున్నారు.
Netizens are warning to Sobhita
అయితే వీరి పెళ్లి డిసెంబర్ 4వ తేదీన అన్నపూర్ణ స్టూడియోలో అత్యంత దగ్గర సన్నిహితుల మధ్య జరుగుతుందని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..ఇక ఇదంతా పక్కన పెడితే ఎప్పుడైతే శోభిత అక్కినేని ఇంటి అడుగుపెట్టిందో నీకు అప్పటినుంచి ఆమె రేంజ్ మారిపోయిందని చెప్పవచ్చు.. మొన్నటికి మొన్న ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు వేడుకల్లో శోభితనే హైలైట్ గా నిలిచింది. (Sobhita)
Also Read: Sobhita: నాగచైతన్య కంటే ముందే ఆ బిజినెస్ మాన్ తో శోభిత ఎఫై**..?
అంతేకాదు తాజాగా అక్కినేని కుటుంబం మొత్తం కలిసి గోవాలో జరుగుతున్నటువంటి ఈఫీ 2024 ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ వేడుకకు నాగార్జున అమల నాగచైతన్య శోభిత వచ్చారు. ఈ వేడుక నవంబర్ 20న స్టార్ట్ అయింది 28 వరకు జరుగుతుంది. ప్రతిరోజు ఎంతో మంది సెలెబ్రిటీలు ఈ వేడుకకు హాజరవుతూ అందరినీ మెస్మరైజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ వేడుకలో అక్కినేని కుటుంబం మొత్తం హాజరైంది. అయితే ఈ వేడుకలో శోభిత కాస్త ఓవర్ చేసినట్టు నేటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.
అయితే శోభిత లైట్ పింక్ కలర్ పంజాబీ డ్రెస్ వేసుకొని పెద్ద గగుల్స్ తో నాగచైతన్య పక్కన నిలుచుంది. అంతేకాకుండా అమల చాలా సింపుల్ గా చీర కట్టుకొని నాగార్జున పక్కన నిలిచింది..శోభిత మాత్రం ఓవర్ లుక్ తో నాకు ఎవరు అడ్డు లేరు అన్న విధంగా అందరికీ కనిపించింది. ఈ ఫోటోలను గమనించిన నేటిజన్స్ పెళ్లి కాకముందే ఇంత ఓవరాక్షన్, ఇంకా పెళ్లయితే ఇంకెలా ఉంటుందో అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కొంతమంది ఒళ్ళు దగ్గర పెట్టుకో లేదంటే ఇబ్బందుల పాలు అవుతావు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.. మరి దీనిపై శోభిత ఎలా స్పందిస్తుందో చూడాలి.(Sobhita)