Is Aishwarya Rajesh married to

Aishwarya Rajesh: ఈ మధ్యకాలంలో కొంతమంది నటీనటులు సీక్రెట్ గా పెళ్లిళ్లు చేసుకొని ఒకేసారి షాక్ ఇస్తున్నారు.. సాధారణంగా మన ఇండియన్స్ పెళ్లి చేసుకుంటే తప్పనిసరిగా నుదుటబొట్టు, పాపిట్లో సింధూరం,మెడలో తాళిబొట్టు ధరిస్తారు. ఇవి ఉన్నాయి అంటే తప్పనిసరిగా పెళ్లైనట్టే.. ఆ విధంగానే ఈ స్టార్ నటి పాపిటబొట్టు,మెడలో తాళిబొట్టు, కాళ్లకు మెట్టెలు పెట్టుకుని అందరికీ షాక్ ఇచ్చింది. ఇంతకీ ఆ స్టార్ నటి ఎవరయ్యా అంటే ఐశ్వర్య రాజేష్..

Is Aishwarya Rajesh married to

తెలుగింట జన్మించిన ఈ ముద్దుగుమ్మ తెలుగు ఇండస్ట్రీలో మాత్రం అంతగా గుర్తింపు సాధించలేదు. తమిళ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పాత్రలు చేస్తూ దూసుకుపోతోంది. కుటుంబ కథా చిత్రాల్లో తనకు తిరుగులేదు అనిపించుకుంటుంది. అలాంటి ఐశ్వర్య రాజేష్ తెలుగు ఇండస్ట్రీలో గుర్తింపు కోసం ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తోంది. ఇప్పటికే తెలుగులో వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీష్, కౌసల్య కృష్ణమూర్తి వంటి చిత్రాల్లో నటించినా అంతగా గుర్తింపు రాలేదు. (Aishwarya Rajesh)

Also Read: Venkatesh: ఆ కమెడియన్ ముందు వెంకీ వేస్ట్.. వెంకటేష్ కి ఘోర అవమానం..?

అయినా కానీ ఈమె తెలుగులో ఒక్క ఛాన్స్ వచ్చిన వదిలిపెట్టకుండా నటిస్తోంది. అయితే తాజాగా ఈమె స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో నటించింది. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతున్న తరుణంలో చిత్ర యూనిట్ వారు ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇదే తరుణంలో లేటెస్ట్ గా ఒక ప్రెస్ మీట్ అరేంజ్ చేసి నటినటులు అందర్నీ అక్కడికి పిలిచారు. దీంతో ఆ సినిమాలో ఏ విధంగా అయితే నటించారో, అదే పాత్రలో నటినటులు ప్రెస్ మీట్ కు హాజరు అవ్వాలని చిత్ర యూనిట్ వారు చెప్పారట.





Is Aishwarya Rajesh married to

ఆ విధంగానే విక్టరీ వెంకటేష్ పంచెతో, ఐశ్వర్య రాజేష్ మెడలో తాళి పాపిటబొట్టుతో, మీనాక్షి చౌదరి పోలీస్ డ్రెస్ లో కనిపించారు.. వారంతా యాక్టింగ్ లో భాగంగా కనిపిస్తూ ఉంటే, ఐశ్వర్య రాజేష్ మాత్రం నిజంగానే పెళ్లి చేసుకుంది అనే విధంగా కనిపిస్తోంది. దీన్నిబట్టి చూస్తే వెంకటేష్ కు భార్యగా ఐశ్వర్య చేయబోతుందట. ఇక వీరి పెయిర్ ఎంతో సెట్ అయినట్టు ఆమె లుక్ చూస్తేనే అర్థమవుతుంది. చూడాలి ఈ సినిమా అయినా ఐశ్వర్య రాజేష్ కెరియర్ ను నిలబెడుతుందా లేదంటే అలాగే ఉంచుతుందా అనేది ముందు ముందు తెలుస్తుంది.(Aishwarya Rajesh)