Maharashtra: మహారాష్ట్రలో… అందరూ ఊహించిందే జరిగింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో… ఎన్డీఏ కూటమి అఖండ విజయాన్ని నమోదు చేసుకుంది. ఎన్డీఏ కూటమికి 231 స్థానాలు దాదాపు వచ్చేసాయి. 288 స్థానాలు ఉన్న మహారాష్ట్రలో… 231 కి… పై అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది బిజెపి కూటమి. అటు కాంగ్రెస్ కూటమికి 50 దాటలేదు. Maharashtra

Revanth reddy post will be defeated by Maharashtra

అయితే మహారాష్ట్ర ఎన్నికల్లో… బిజెపి కూటమి విజయం సాధించడంతో… తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవి ఉంటుందా? ఆయనను తొలగిస్తారా అనే టెన్షన్ అందరిలోనూ ఉంది. వాస్తవంగా.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి ప్రస్తుతానికైతే సేఫ్ గా ఉన్నట్లు… చెబుతున్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి గెలిచి ఉంటే.. రేవంత్ రెడ్డి పదవి పోయే అవకాశాలు ఉన్నట్లు.. రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. Maharashtra

Also Read: Ys Sharmila: అదానీని తరిమికొట్టండి…రేవంత్ కు వైఎస్ షర్మిల హెచ్చరిక.. ?

మహారాష్ట్రలో కాంగ్రెస్ గెలిస్తే… పెద్ద రాష్ట్రం రాహుల్ గాంధీ చేతిలోకి వెళ్లిపోయేది.అప్పుడు మహారాష్ట్ర నుంచి ఏదైనా ఫండ్స్ కావాలంటే కాంగ్రెస్ వినియోగించుకునేది. కానీ ఇప్పుడు మహారాష్ట్రలో కాంగ్రెస్ ఘోరంగా ఓడింది. ఇప్పుడు మళ్లీ నిధులకు కోసం తెలంగాణ రాష్ట్రానికి రావాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ నేతల్లో… ఎక్కువ నిధులు తీసుకువచ్చే సత్తా రేవంత్ రెడ్డికి మాత్రమే ఉంది. అందుకే అతన్ని ఇప్పుడు తొలగించే అవకాశాలు లేనట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. Maharashtra