BGT 2024: భారత్ – ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ సిరీస్ నవంబర్ 22వ తేదీన ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ పెర్త్ వేదికగా జరగనుంది. ఆస్ట్రేలియాలో టీమ్ ఇండియా హ్యాట్రిక్ విజయన్ని నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన గత రెండు టెస్టుల సిరీస్ లో భారత్ ఓటమిపాలైంది. BGT 2024
BGT 2024 Ind Vs Aus Prize Money
బోర్డర్ – గవాస్కర్ సిరీస్ గెలిస్తే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో టీమిండియా ఫైనల్ కి చేరడం దాదాపుగా ఫిక్స్ అవుతుంది. ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ గెలిచినందుకు క్రికెట్ ఆస్ట్రేలియా ఎలాంటి డబ్బును చెల్లించదు. గెలిచిన జట్టుకు మాత్రమే ట్రోఫీని అందజేస్తుంది. కానీ ఇటు బీసీసీఐ, అటు ఆస్ట్రేలియా క్రికెట్ వారి జట్లకు భారీ మొత్తంలో బహుమతిని ఇస్తాయి. BGT 2024
Also Read: KTR: BRSకు బిగ్ షాక్…కాంగ్రెస్ పార్టీలోకి కేటీఆర్ సన్నిహితులు ?
చివరిసారి భారత్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలుచుకున్నప్పుడు బీసీసీఐ మొత్తం జట్టుకు ఐదు కోట్ల రూపాయలను బహుమతిగా అందజేసింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ వరుసగా నాలుగు సార్లు ఆస్ట్రేలియా చిత్తుచిత్తుగా ఓడించింది. ఆస్ట్రేలియాతో పాటు సొంత గడ్డపై కూడా భారత్ రెండుసార్లు ఈ ట్రోఫీని గెలుచుకొని విజయాన్ని నమోదు చేసుకుంది. BGT 2024