Keerthy Suresh: కీర్తి సురేష్ పెళ్లి వార్తలు ఇప్పుడు తమిళ మీడియా మొత్తం వినిపిస్తున్నాయి. అయితే ఇది రూమర్ అని కొంతమంది కొట్టి పారిస్తే కొంతమందేమో నిజమే అంటున్నారు. ఎందుకంటే ఇన్ని రోజులుగా ఈమె పెళ్లి వార్తలు వినిపిస్తే ఒక్కసారైనా క్లారిటీ ఇవ్వక మానదు. కానీ క్లారిటీ ఇవ్వడం లేదంటే నిజంగానే పెళ్లి చేసుకోబోతుందని పరోక్షంగా అర్థం చేసుకోవచ్చు. అయితే పెళ్లంటే కచ్చితంగా అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళకు కట్నం ఇస్తూ ఉంటారు.
Keerthy Suresh dowry is worth several crores to her mother-in-law
ఇక సెలబ్రెటీల విషయంలో అయితే ఇది మరీ ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది.ఎందుకంటే చాలా మంది సెలబ్రిటీలు అత్తగారింటికి కట్నంగా కోట్లకు కోట్లు తీసుకువెళ్తుంటారు.మరి మహానటి కీర్తి సురేష్ తన అత్తారింటికి ఎన్నికోట్ల కట్నం తీసుకు వెళ్తుందో ఇప్పుడు చూద్దాం. కీర్తి సురేష్ ఇప్పటివరకు సినిమాల ద్వారా చాలానే కోట్లు కూడబెట్టింది. (Keerthy Suresh)
Also Read: Ruhani Sharma: పెళ్లి చేసుకున్న వెంకటేష్ హీరోయిన్.. ఇంత ట్విస్ట్ ఇచ్చిందేంటి.?
కేవలం సినిమాలు మాత్రమే కాకుండా వ్యాపార ప్రకటనల్లో కూడా నటించి రెండు చేతులా సంపాదించింది. అలా ఓవైపు యాడ్స్ మరోవైపు సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూ కోట్లు కూడబెట్టిన కీర్తి సురేష్ తన ఖర్చులకు ఉంచుకొని మిగతా డబ్బు మొత్తం తండ్రికి ఇచ్చేదట. ఇక తండ్రి తన కూతురి ఇచ్చిన డబ్బు మొత్తాన్ని కూతురి పేరిటే కొన్ని ఆస్తులుకొని పక్కన పెట్టారట.అయితే కూతురు సంపాదించిన డబ్బులతో కొన్న ఆస్తి మొత్తాన్ని సురేష్ కుమార్ తన కూతురు పెళ్లికే కట్నంగా ఇస్తున్నారట.
అలాగే తనకు ఉన్న ఇద్దరు కూతుర్లలో పెద్దకూతురుకి చిన్న కూతురుకి సరిసమానంగా తన ఆస్తిపాస్తులను రాస్తున్నట్టు తెలుస్తోంది. ఈ లెక్కన కీర్తి సురేష్ తన అత్తగారింటికి బంగారంతో పాటు చెన్నైలో ఉండే రెండు లగ్జరీ ఇళ్లను కూడా కట్నంగా తీసుకువెళ్తుందట.అలాగే ఇప్పటివరకు కీర్తి సురేష్ తన సంపాదనతో కొన్న లగ్జరీ కార్లను కూడా కట్నంగా ఇస్తున్నారట.అంతేకాకుండా 100 కోట్ల వరకు డబ్బును కూడా ముట్టచెపుతున్నట్టు తెలుస్తోంది.(Keerthy Suresh)