Team India: టీ20 వరల్డ్ కప్ గెలిచిన మధురమైన క్షణాలను ఆస్వాదిస్తున్న సమయంలోనే బీసీసీఐ ఒక సంచలన ప్రకటన చేసింది. అదేంటంటే…. ఉత్తమ ప్రదర్శన కనబరిచి ఒక్క ఓటమి కూడా చవిచూడకుండానే టి20 వరల్డ్ కప్ ను కైవసం చేసుకుంది రోహిత్ సేన. 13 ఏళ్లుగా ఎలాంటి ఐసిసి ట్రోఫీ అందుకొని బీసీసీఐకు ఈ విజయం వారిని సగౌరవంగా తల ఎత్తుకునేలా చేసింది. Team India
Rohit Sharma and co stuck in Barbados as Hurricane Beryl disrupts travel plans for team India
అందుకే ఈ కప్పు గెలిచిన టీమ్ ఇండియాకు బీసీసీఐ 120 కోట్ల రూపాయల ప్రైస్ మనీని ప్రకటిస్తున్నట్లు బీసీసీఐ సెక్రటరీ జైషా ఆదివారం రోజున రాత్రి ప్రకటించారు. టీ20 ప్రపంచకప్ గెలిచిన టీమిండియాకు 125 కోట్ల నగదు బహుమతిని ప్రకటిస్తున్నందుకు సంతోషిస్తున్నా. టోర్నీ అసాధారణ ప్రతిభ, పట్టుదల, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించింది. ఆటగాళ్లు, కోచ్ సహాయక సిబ్బందికి అభినందనలు అని జైశా ట్విట్టర్ Xలో పేర్కొన్నారు. మొత్తం ప్రపంచంలోనే బీసీసీఐ చాలా రిచ్ అని చెప్పుకోవడానికి ఇదే ఒక ఉదాహరణ. Team India
Also Read: T20 World Cup 2024: టీమిండియా విజయానికి 5 ప్రధాన కారణాలు ఇవే!
ఎందుకంటే టీ20 వరల్డ్ కప్ గెలిచినందుకుగాను ఐసీసీ ఇచ్చే ప్రైస్ మనీ సుమారు 20 కోట్ల 42 లక్షలు. మరి బీసీసీఐ ఎంత ఇస్తుందో తెలుసా…. 125 కోట్లు. అంటే ఐసీసీ ఇచ్చే ప్రైస్ మనీ కన్నా బీసీసీఐ ఇచ్చే ప్రైస్ మనీ 100 కోట్లు ఎక్కువ. అందుకే చాలామంది మిగతా బోర్డులతో పోలిస్తే బీసీసీఐ చాలా తోపు అని అంటారు. ఈ విషయం తెలిసిన టీమ్ ఇండియా ఫ్యాన్స్ ఈ నిర్ణయంపై చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. Team India
ఇది ఇలా ఉండగా… టీమిండియా జట్టు పెను ప్రమాదంలో చిక్కుకుంది. తుఫాన్ కారణంగా టీమిండియా జట్టు బార్బడోస్ లో చిక్కుకుంది. బార్బడోస్ లో వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో తుఫాన్ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. దీంతో బార్బడోస్ విమానాశ్రయాన్ని కూడా మూసివేశారు. విమానాశ్రయం మూసివేయడంతో మన టీమిండియా ప్లేయర్ లందరూ…బార్బడోస్ లోని హోటల్ గదుల్లోనే ఉండిపోవడం జరిగింది. పరిస్థితులు మెరుగు అయిన తర్వాత టీమ్ ఇండియా జట్టు… ఇండియాకు రాబోతున్నట్లు సమాచారం అందుతుంది. Team India