Junior NTR: మన టాలీవుడ్ స్టార్స్ లో ఒకరైన ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇటీవల త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న ఎన్టీఆర్ ప్రజెంట్ కొరటాల శివ డైరెక్షన్లో దేవర అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

The heroine who rejected Junior NTR three times

ఇక త్వరలో థియేటర్లలో ఈ మూవీతో సందడి చేయనున్నాడు తారక్. ఆపైన ప్రశాంత్ నీళ్లతో భారీ ప్లానింగ్ చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇక ఈ క్రమంలో ఎన్టీఆర్ కి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ తో సినిమా అంటే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేసి ఓకే చెబుతుంది.

Also Read: Lavanya Tripathi: సమంతా బాటలో నడుస్తున్న మెగా కోడలు లావణ్య.. తెరపైకి వచ్చిన నిజం..!

ప్రెసెంట్ తారక్ చేస్తున్న దేవరా మూవీలో కూడా హీరోయిన్గా బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ నటిస్తుంది. అయితే ఎన్టీఆర్ మూవీలో ఆఫర్ కోసం ఎంతోమంది ఎదురు చూస్తుంటే ఓ హీరోయిన్ మాత్రం తారక్ సినిమాను రిజెక్ట్ చేసిందట. అది కూడా మూడుసార్లు. ప్రజెంట్ ఇదే న్యూస్ బాలీవుడ్ అండ్ టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది.

The heroine who rejected Junior NTR three times

మూడుసార్లు ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వచ్చినప్పటికీ రకరకాల కారణం చేత ఆ హీరోయిన్ రిజెక్ట్ చేసిందట. ఆ ముద్దుగుమ్మ మరెవ్వరో కాదు త్రిబుల్ ఆర్ బుట్ట బొమ్మ ఆలియా భట్. కొన్ని సార్లు కథ నచ్చక మరికొన్నిసార్లు సెకండ్ హీరోయిన్ గా అడగడంతో ఆమె రిజెక్ట్ చేసిందట. ఫైనల్ గా త్రిబుల్ ఆర్ సినిమాకి ఓకే చెప్పింది ఈ బ్యూటీ. ప్రజెంట్ ఇదే వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.(Junior NTR)