Chandra Babu: ఏపీ సీఎం చంద్రబాబు బుధవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. గురువారం ఉదయం మోడీ తో భేటీ కాబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం జూలై చివరి వారంలో పూర్తి స్థాయి బడ్జెట్ తీసుకురాబోతున్న నేపథ్యంలో రాష్ట్ర అవసరాలను ప్రధాని దృష్టికి తీసుకు వెళ్లి తగిన సహాయం కోరనున్నారు. సీఎం చంద్రబాబుతో పాటుగా రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, రహదారుల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్రావు కూడా ఉన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరజ్ కుమార్ ప్రసాద్ ఇతర అధికారులు ఢిల్లీ చేరుకున్నారు.
Chandra Babu reached Delhi
నిన్న రాత్రి టీడీపీ, జనసేన, బీజేపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు పార్లమెంట్ తొలి సమావేశాలు జరిగిన తీరును తెలుసుకున్నారు. అలాగే భవిష్యత్తులో జరిగే సమావేశాల్లో రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం ఎంపీలు నిర్వహించాల్సిన పాత్ర గురించి చర్చించారు అలాగే సీఎం ఈ పర్యటనలో ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ప్రధానికి తెలియజేయనున్నారు. ఇతర కేంద్ర మంత్రులు దృష్టికి కూడా తీసుకువెళ్లి ఆర్థికంగా మౌలిక వసతుల పరంగా సహాయం కోరనున్నట్లు తెలిసింది.
Also read: Rahul Gandhi: ఆ హీరోయిన్ రాహుల్ గాంధీని అంతలా ప్రేమించిందా.. పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్.. కానీ.!
రాజధాని అమరావతి నిర్మాణంతో పాటుగా పోలవరం ప్రాజెక్టు వేగంగా పూర్తి చేయడం అలానే అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్ రహదారుల మరమ్మత్తులు పేదల ఇళ్లు ఇలా కొన్ని ముఖ్యమైన అంశాల గురించి సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించబోతున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక విజ్ఞప్తులను సీఎం చేయబోతున్నట్లు సమాచారం. ఈరోజు ఉదయం 10:15 గంటలకు ప్రధానిని చంద్రబాబు నాయుడు కలుస్తారు అప్పుడు ఈ విషయాలన్నీ ఆయనతో చర్చించి ఏపీ ప్రజలకి మేలు చేకూరే విధంగా సమస్యల గురించి చెప్పి పరిష్కరించాలని కోరుతారు (Chandra Babu).