Chiranjeevi: డాన్స్ మాస్టర్ గా విపరీతమైన డిమాండ్ ఉన్న టైం లోనే దర్శకుడిగా మారి నాగార్జునతో మాస్ లాంటి బ్లాక్ బస్టర్ కొట్టినా లారెన్స్ అనంతరం మంచి సిరీస్ నుంచి హీరోగా అండ్ డైరెక్టర్ గా బిజీ అయిపోయాడు. అయితే ముందు నుంచి లారెన్స్కు మెగాస్టార్ చిరంజీవి అంటే ప్రత్యేకమైన అభిమానం.
ముఠామేస్త్రిలో సైడ్ డాన్సర్ గా ఉన్న తనకు హిట్లర్ రూపంలో అతిపెద్ద బ్రేక్ ఇవ్వడం వల్లే అందరితో సినిమాలు చేస్తూ ఈ స్థాయికి ఎదిగానని పలు సందర్భాల్లో చెబుతూ ఉంటారు. అందుకే తొమ్మిదేళ్ల క్రితం ఖైదీ నెంబర్ 150 లో రత్తాలు రత్తాలు పాటను కంపోజ్ చేయమని పిలుపు వచ్చినప్పుడు ఆలోచించకుండా చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చి పూర్తి బాధ్యతలు తీసుకున్నానని లారెన్స్ ఆ మధ్య తన సినిమా ప్రమోషన్స్ లో వెల్లడించారు. మళ్లీ ఈ కలయిక సాధ్యపడలేదు.
ఇక తాజాగా విశ్వంభర లో ఒక పాట కోసం తిరిగి ఈ కాంబో రిపీట్ కానుందని సమాచారం. డాన్స్ బీట్ ఉన్న ఒక మంచి పాటకు లారెన్స్ అయితేనే న్యాయం చేస్తాడని భావించిన మెగాస్టార్ స్వయంగా ఫోన్ చేసి అడగడంతో ఆ మేరకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని మెగా కాంపౌండ్ న్యూస్. ఇక అఫీషియల్ అయితే కాలేదు. వచ్చే ఏడాది సంక్రాంతి జనవరి 10 విడుదల కాబోతున్నట్లు తెలుస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే ఇటు లారెన్స్ కానీ అటు మెగాస్టార్ కానీ స్పందించాలి.