Allu Aravind beat the man to for Chiranjeevi

Allu Aravind: మెగాస్టార్ చిరంజీవిని ఎవరు ఏమన్నా అంటే అభిమానులు అస్సలు ఊరుకోరు. ఆయన గురించి ఒక్క నెగటివ్ పదం వాడినా సరే అక్కడ రక్తపాతం మొదలవుతుంది. ఇక ఇలా అభిమానులు మాత్రమే కాదు కుటుంబ సభ్యులు కూడా చేస్తారట.దానికి ప్రధాన ఉదాహరణగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ తన అన్న చిరంజీవిని షూటింగ్ స్పాట్ దగ్గర ఎవరో రౌడీలు అసభ్య పదజాలం ఉపయోగించారు అనే విషయం తెలుసుకొని వాళ్ల దగ్గరికి వెళ్లి మరీ రౌడీలను చితక్కొట్టి హాస్పిటల్ పాలుజేశారు.

Allu Aravind beat the man to for Chiranjeevi

అయితే ఇలా అన్నపై అభిమానం పవన్ కళ్యాణ్ కి మాత్రమే కాదు బావపై అభిమానం, ప్రేమ అల్లు అరవింద్ కి కూడా ఉంది. అవును మీరు వినేది నిజమే. అల్లు అరవింద్ సోదరి సురేఖని చిరంజీవికి పెళ్లి చేసిన సంగతి మనకు తెలిసిందే.ఇక పెళ్లి తర్వాత అల్లు వారింటి అల్లుడుగా చిరంజీవి ఫేమస్ అయ్యారు. అలాగే గీతా ఆర్ట్స్ పెట్టిన సమయంలో చిరంజీవి గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఎన్నో సినిమాలు చేసి ఆ నిర్మాణ సంస్థకి పేరచ్చేలా చేశారు.అలా అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీ ఒకరికి ఒకరు సపోర్ట్ గా నిలుస్తూ వస్తున్నారు. (Allu Aravind)

Also Read: Prabhas: కల్కి మూవీలో ప్రభాస్ పాత్రని వదులుకున్న అన్ లక్కీ హీరో.. ఎవరంటే..?

అయితే గతంలో ఇండస్ట్రీకి చెందిన ఓ పెద్ద మనిషి చిరంజీవిని నానా మాటలు అని అసభ్య పదజాలం ఉపయోగించాడట. దాంతో ఆ మాటలన్నీ విన్న అల్లు అరవింద్ విసుగుచెంది ఆ వ్యక్తిని రక్తం వచ్చేలా కొట్టారట. ఇక అసలు విషయం ఏమిటంటే.. చిరంజీవి ఓ సినిమా చేస్తున్న సమయంలో చిరంజీవి,అల్లు రామలింగయ్య, శ్రీదేవి లకు కాల్షీట్లు చూసుకునే ఓ వ్యక్తి ఉండేవారు. అయితే ఆ వ్యక్తి ప్రతిరోజు తాగొచ్చి షూటింగ్ సెట్లో నానా హంగామా చేసేవాడు. ఇక ఈ విషయం గురించి అల్లు అరవింద్ ఆయనకు చెప్పి ఇలా షూటింగ్ సెట్ కి తాగి రాకూడదని అన్నారట.

Allu Aravind beat the man to for Chiranjeevi

అయినప్పటికి ఆయన తీరు మార్చుకోలేదట. ఇక ఓ రోజు బాగా తాగి సినిమా థియేటర్ నుండి సినిమా చూసి బయటికి వచ్చే సమయంలో చిరంజీవిని నానా బూతులు తిట్టారట. దాంతో పట్టలేని కోపంతో ఉన్న అల్లు అరవింద్ ఆ వ్యక్తిని ఈడ్చుకు వెళ్లి రక్తం వచ్చేలా కొట్టారట.ఇక అల్లు అరవింద్ దెబ్బలకు ఆ వ్యక్తికి 13 కుట్లు పడ్డాయట. అలా చిరంజీవిని ఎవరు ఏమన్నా కూడా అల్లు అరవింద్ అస్సలు సహించరట. ఈ విషయాన్ని అల్లు అరవింద్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.కానీ ఆ వ్యక్తి పేరు ఏంటో మాత్రం బయట పెట్టలేదు.(Allu Aravind)