Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో చాలా చురుకుగా ఉన్నారు. డిప్యూటీ సీఎం అయ్యాక పార్టీలో మరింత జోష్ పెరిగింది. ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేస్తూ అందరితో శభాష్ అనిపించుకున్న పవన్ కళ్యాణ్ కేవలం సినీ రాజకీయాల్లోనే కాదు కుటుంబాన్ని కూడా బాధ్యతగా చూసుకుంటారు. తన కుటుంబంపై ఈగ కూడా వాలనివ్వరు. తన మెగా ఫ్యామిలీలో ఎవరిని ఏమన్నా కూడా అస్సలు సహించరు. ఇక కుటుంబం ఇబ్బందుల్లో ఉంటే కూడా ఆదుకుంటారట.
Pawan Kalyan To pay off elder brother’s debts
ఇందుకు ఉదాహరణ నాగబాబు అప్పుల్లో కూరుకున్న సమయంలో పవన్ కళ్యాణ్ చేసిన సహాయమే.అయితే అప్పట్లో నాగబాబు కేవలం సినిమాల్లో నటుడు గానే కాకుండా కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. అయితే ఆయన చేసిన కొన్ని సినిమాలు ప్లాప్ అవ్వడంతో పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయారట. దాంతో ఆయన చాలా డిప్రెషన్ లోకి వెళ్లి ఎంతగానో ఇబ్బంది పడిపోయారట. (Pawan Kalyan )
Also Read: Prabhas: నాకోసం ప్రభాస్ అటువంటి పని చేశాడు.. నటి కామెంట్స్..!
అప్పుల వాళ్ళందరూ ఇంటికి వచ్చి ప్రతిసారి అడగడంతో ఇది చూసి చలించిపోయిన పవన్ కళ్యాణ్ ఎలాగైనా సరే తన అన్నయ్యకి ఈ విషయంలో సహాయం చేయాలి అని గబ్బర్ సింగ్ సినిమాని ఇష్టం లేకపోయినా సరే ఒప్పుకున్నారట. అయితే మొదట్లో గబ్బర్ సింగ్ సినిమా స్టోరీ ఆయన దగ్గరికి వచ్చిన సమయంలో నేను చేయను అని అన్నారట.ఇక ఆ టైంలో దబాంగ్ సినిమా స్టోరీ నీ రీమేక్ చేద్దామని కొంతమంది ఈయనని అడిగారట.కానీ అప్పుడు రిజెక్ట్ చేసినప్పటికీ ఆ తర్వాత నాగబాబు కోసం ఈ సినిమాలో కొన్ని మార్పులు చేర్పులు చేసి గబ్బర్ సింగ్ సినిమాలో నటించాను.
అయితే ఈ మూవీలో నటించడానికి ప్రధాన కారణం నాగబాబేనని, మా అన్నయ్య ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తీర్చడం కోసం నాకు మరో దారి కనబడలేదు. ఆ టైంలోనే ఈ సినిమా గుర్తుకు వచ్చింది. దాంతో మరో దారి లేక ఈ సినిమాని ఒప్పుకున్నాను అంటూ పవన్ కళ్యాణ్ అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడడం సంచలనం సృష్టించింది. దాంతో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాలో చేసింది తన అన్నయ్య నాగబాబు అప్పు తీర్చడం కోసమేనని అందరూ మాట్లాడుకున్నారు. అలా పవన్ తనని నమ్ముకున్న ప్రజల కోసమే కాదు తన కుటుంబ సభ్యులకు కూడా కష్టం వస్తే కచ్చితంగా ఆదుకుంటారట.(Pawan Kalyan )