Darshan: కన్నడ నటుడు దర్శన్ అభిమాని రేణుక స్వామిని హత్య చేసిన కేసులో రోజుకొక ట్విస్ట్ లు బయట పడుతున్నాయి. ఇప్పటికే రేణుక స్వామి హత్య కేసులో పోలీసులు ఎన్నో రకాల విషయాలను బయటపెడుతూ ట్విస్ట్ ల మీద ట్విస్టులు ఇస్తున్నారు.అయితే తాజాగా రేణుకా స్వామి హత్య కేసులో మరొక ట్విస్ట్ బయటపడింది.

Darshan: Killing a fan and doing occult worship in his wife’s flat.

అదేంటంటే దర్శన్ రేణుక స్వామిని చంపాక తన భార్య ఫ్లాట్లో పూజలు చేశారంటూ మరో వార్త మీడియాలో వైరల్ అవుతుంది.ఇక అసలు విషయంలోకి వెళ్తే.. కన్నడ నాట సంచలనం సృష్టిస్తున్న రేణుక స్వామి హత్య కేసు రోజుకొక మలుపు తిరుగుతుంది. అయితే తాజాగా ఈ కేసు నుండి కీలక ఆధారాలను పోలీసులు సేకరించినట్టు తెలుస్తోంది. (Darshan)

Also Read: Mythri Movie Makers: వారిని తెలుగు హీరోలు నమ్మడం లేదా.. దొరకడం లేదా!!

అదేంటంటే.. కన్నడ హీరో దర్శన్ తన అభిమాని రేణుకా స్వామిని హత్య చేసే సమయంలో వేసుకున్న లోఫర్స్ ఆయన భార్య విజయలక్ష్మి ఫ్లాట్లో పోలీసులు సేకరించారు. అయితే రేణుక స్వామిని హత్య చేసి వచ్చాక విజయలక్ష్మి ఫ్లాట్ కి వచ్చి పూజలు చేసి తిరిగి మళ్ళీ దర్శన్ మైసూర్ కి వెళ్ళినట్టు తెలుస్తోంది. విజయలక్ష్మి ఫ్లాట్లో ఫుట్వేర్ మాత్రమే కాకుండా కొన్ని దుస్తులు కూడా పోలీసులకు కనిపించాయి.

Darshan: Killing a fan and doing occult worship in his wife's flat.

ఇక ఈ దుస్తులు ఫుట్వేర్ ని విజయలక్ష్మి కి దర్శన్ యొక్క అసిస్టెంట్ ఇచ్చినట్టు పోలీసులు చెప్పారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ మరోసారి మీడియాలో వైరల్ గా మారేసరికి హత్య చేసి ఏమీ తెలియని వాడిలా మళ్లీ దేవుడికి పూజలు కూడానా అంటూ కొంతమంది దర్శన్ పై ఫైర్ అవుతున్నారు. మరి ఈ కేసు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.(Darshan)