Ravi Teja Mr. Bachchan Movie Release Date Fix

Ravi Teja: మాస్ మహారాజ్ రవితేజ హీరోగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కలయికలో వచ్చిన ధమాకా చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఇక ఈ చిత్రంలోని పాటలు అండ్ మాస్ స్టెప్పులతో సినీ ప్రేక్షకులతో విజిల్స్ కొట్టించాయి. అప్పటివరకు వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న రవితేజకు ధమాకా భారీ సక్సెస్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత రవితేజ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణం లో మరోసారి నటిస్తున్నాడు.

హరీష్ శంకర్ డైరెక్షన్లో రవితేజ హీరోగా భాగ్యశ్రీ బోర్స్ కథానాయకగా మిస్టర్ బచ్చన్ అనే టైటిల్ తో ఓ సినిమా రాబోతుంది. భారీ యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. గత ఏడాది రిలీజ్ అయినా ఈగల్ సినిమా ఫ్యాన్స్ను నిరుత్సాహపరిచింది. హరి శంకర్ అండ్ రవితేజ కాంబినేషన్లో వచ్చిన మిరపకాయ్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక దీంతో హరీష్ శంకర్ తమ హీరోకు హిట్ ఇస్తాడని రవితేజ అభిమానులు నమ్ముతున్నారు. కాగా ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ ను లాక్ చేసినట్లు తెలుస్తుంది.

Ravi Teja Mr. Bachchan Movie Release Date Fix

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న బచ్చన్ విడుదలకు సన్న హాలు చేస్తున్నారు నిర్మాతలు. ఆగస్టు 14న ప్రీమియర్స్ తో యూఎస్ఏ లో విడుదల చేసేందుకు ఫస్ట్ కాపీ రెడీ చేసి అందించే విధంగా దర్శకుడు హరీష్ శంకర్ షూటింగ్ ప్లాన్ చేశాడు. ఇక తాజాగా పాటలకు సంబంధించి మ్యూజిక్ ఫెస్టివల్ ప్రారంభించామని త్వరలోనే ఫస్ట్ సింగిల్ ను విడుదల చేస్తామని చిన్నప్పటి వీడియో గ్లింస్ రిలీజ్ చేసింది యూనిట్.