Rohini: సోషల్ మీడియా పుణ్యమా అంటూ సినీ సెలబ్రిటీలు కొంతమంది వైరల్ అవుతుంటే మరి కొంతమంది మాత్రం ట్రోల్స్ బారిన పడుతున్నారు. ఇది కలియుగం కాదు సోషల్ మీడియా యుగం అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఆ రేంజ్ లో సోషల్ మీడియా హైట్ పెరిగింది మరి. సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది వెలుగులోకి వస్తున్నారు. అదేవిధంగా సెలబ్రిటీస్ కి వారు చెప్పాలనుకునే మాటలను సైతం కామెంట్స్ రూపంలో పెడుతున్నారు.
ఇక తాజాగా జబర్దస్త్ కమెడియన్ రోహిణి సైతం ట్రోల్స్ కి గురైంది. రోహిణి అంటే పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ జబర్దస్త్ కమెడియన్ రోహిణి అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు. అంత క్రేజ్ ఉంది మరి ఈ పేరుకి. అంతలాగా తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకుంది ఈ లేడీ కమెడియన్. తన పంచ్ డైలాగులతో రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలని ఆకట్టుకుంది. టీవీ యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి కమీడియన్ గా కెరియర్ని స్టార్ట్ చేసిన రోహిణి అనంతరం సీరియల్స్ అండ్ సినిమాలు అదే విధంగా వెబ్ సిరీస్ లలో కనిపిస్తూ దుమ్మురేపుతుంది. ఇక మరోవైపు ఈవెంట్ కార్యక్రమాలు చేస్తుంది కూడా.
సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది రోహిణి. ఈ క్రమంలోనే రోహిణి తరచూ ట్రోల్స్ ఎదుర్కొంటుంది. తాజాగా ఆమె చీరకట్టులో ఉన్న వీడియోలు అండ్ ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇక వీటిని చూసినా ప్రేక్షకులు కొందరు తమకి తోచిన విధంగా కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఓ యూజర్..” చీర తరువాత కట్టుకోవచ్చు గానీ ముందు మంచి మొగుడ్ని చూసుకో ” అంటూ కామెంట్ చేశారు. ఇక ఇంకొకరు అయితే.. గేదెలా ఉన్నావ్ కాస్త తగ్గు.. అంటూ బాడీ షేవింగ్ చేస్తూ కామెంట్ చేశారు. ప్రెసెంట్ ఎందుకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.