Dimple Hayathi Marraige

Dimple Hayathi: డింపుల్ హయాతి.. తెలంగాణ అమ్మాయి అయినా ఈ హీరోయిన్ తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది గల్ఫ్ అనే మూవీ తో. అయితే ఈ సినిమా అంతగా హిట్ కొట్టలేదు.ఆ తర్వాత యురేకా అనే మూవీలో కూడా నటించింది.కానీ ఈ మూవీ కూడా ఏ మాత్రం పేరు తెచ్చి పెట్టలేదు.ఇక డింపుల్ హయాతి మాస్ మహారాజ రవితేజతో ఖిలాడి మూవీలో నటించింది. ఈ సినిమా హిట్టు కాకపోయినప్పటికి కూడా డింపుల్ హయాతికి గుర్తింపు మాత్రం వచ్చింది.

Dimple Hayathi Marraige

అలాగే వరుణ్ తేజ్ హీరోగా చేసిన గద్దల కొండ గణేష్ మూవీలో జర్రా జర్రా అనే ఐటమ్ సాంగ్ లో కూడా చేసింది. అలాగే గోపీచంద్ హీరోగా చేసిన రామబాణం మూవీలో చివరిగా ఈ ముద్దుగుమ్మ నటించింది. అయితే అలాంటి ఈ హీరోయిన్ త్వరలోనే పెళ్లి పీట లెక్కబోతున్నట్లు తెలుస్తోంది.. అయితే గత కొద్ది రోజులుగా డింపుల్ హాయాతి ఓ వ్యక్తితో సహ జీవనం చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. (Dimple Hayathi)

Also Read: Aditi Agarwal: గంగోత్రి మూవీ హీరోయిన్ ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఆ హీరో నేనా…?

ఎందుకంటే ఈమె గతంలో ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే తో అపార్ట్మెంట్లోని పార్కింగ్ ప్లేస్ విషయంలో గొడవ పెట్టుకున్న సంగతి మనకు తెలిసిందే. ఆ సమయంలో డింపుల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన సమయంలో ఆమెతోపాటు ఆమె ప్రియుడు కూడా ఉన్నాడు. దాంతో ఈ విషయం బయటికి వచ్చింది. అంతేకాదు డింపుల్ తన బాయ్ఫ్రెడ్ తో కలిసి ఒకే ప్లాట్ లో సహజీవనం చేస్తుంది అని కూడా తెలిసింది.

Dimple Hayathi Marraige

అయితే ప్రస్తుతం డింపుల్ హాయాతి కి సినిమాల్లో ఎక్కువగా అవకాశాలు రాకపోవడంతో పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని చూస్తుందట. త్వరలోనే ఈ ముద్దుగుమ్మ తన పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ బయట పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. మరి డింపుల్ హయాతి నిజంగానే పెళ్లి చేసుకోబోతుందా లేక మరికొన్ని రోజులు సినిమాల్లో కొనసాగుతుందా అనేది చూడాలి.(Dimple Hayathi)