Sobhan Babu: టాలీవుడ్ స్టార్ హీరో దివంగత నటుడు శోభన్ బాబు పేరు చెప్పగానే అందరికీ తమిళనాడు మాజీ సీఎం దివంగత నటి జయలలితనే గుర్తుకు వస్తుంది. ఎందుకంటే వీరిద్దరి రిలేషన్ గురించి వీరు బతికున్న సమయంలో ఎన్ని వార్తలు మీడియాలో చక్కెర్లు కొట్టాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే శోభన్ బాబు జయలలిత ను పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పటికీ తనను నమ్మి తన వెంటే వచ్చిన తన భార్యకి అన్యాయం చేయకూడదు అనే ఒకే ఒక్క ఉద్దేశంతోనే జయలలితని పెళ్లి చేసుకోకుండా సీక్రెట్ గా ఆమెతో వ్యవహారాలను నడిపే వారిని అప్పట్లో ఓ టాక్ వినిపించింది.

Did Jayalalitha Sobhan Babu really have a daughter.

ఇక సోగ్గాడిగా తెలుగు ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న శోభన్ బాబు కి అప్పట్లో ఎంతో మంది లేడీ ఫ్యాన్స్ ఉండేవారట. కేవలం మాములు అమ్మాయిలు మాత్రమే కాదు ఆయనకు ఇండస్ట్రీలో కూడా చాలామంది హీరోయిన్లు పడిపోయారట.కానీ శోభన్ బాబు ఎక్కడ కూడా రాంగ్ స్టెప్ వేయలేదు. కేవలం జయలలిత దగ్గర మాత్రం రాంగ్ స్టెప్ వేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. వారిద్దరి మధ్య ఉన్న రిలేషన్ నాకు తెలియదు.(Sobhan Babu)

Also Read: Matka: కొంచెం గ్యాప్ ఇచ్చి..మళ్ళీ మొదలెట్టిన మెగా ‘ప్రిన్స్’!!

కానీ ప్రతి ఒక్కరికి ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది అది నిజమే కావచ్చు. కానీ వారికి కూతురు పుట్టింది అనే వార్తల్లో ఎలాంటి నిజం లేదు అని ఖండించారు. అయితే అప్పట్లో వీరిద్దరూ సహజీవనం చేశారని,వీరికి ఒక అమ్మాయి కూడా పుట్టింది అనే ప్రచారం జరిగింది.. ఇక అనూహ్యంగా జయలక్ష్మి అనే మహిళ నేను జయలలిత,శోభన్ బాబులకు పుట్టిన సంతానంని అని,కావాలంటే డిఎన్ఏ టెస్ట్ కూడా చేయించండి అంటూ మీడియా ముందుకు వచ్చింది.

Did Jayalalitha Sobhan Babu really have a daughter.

దాంతో జయలక్ష్మి ఒక్కసారిగా మీడియాలో హాట్ టాపిక్ అయింది.అయితే కొన్ని కారణాల వల్ల తాను ఇన్ని రోజులు వారి కూతురని బయట చెప్పుకోలేదు అంటూ కూడా చెప్పింది.ఇక ఈ విషయం జయలలిత మరణించాక జయలక్ష్మి చెప్పింది.అంతేకాదు జయలలిత ఆస్తికి నేనే వారసురాలిని అని చెప్పుకుంది. దాంతో చాలామంది ఈమె జయలలిత ఆస్తికి ఆశపడే ఇలా కూతుర్ని అని చెప్పుకుందంటూ మాట్లాడుకున్నారు. అలా అప్పట్లో జయలలిత శోభన్ బాబుల గురించి పత్రికల్లో,టీవీలలో ఎన్నో వార్తలు వినిపించాయి.(Sobhan Babu)