Niveda pethuraj: చాలామంది ముద్దుగుమ్మలు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూ ఉంటారు. కానీ అందులో కొంతమంది మాత్రమే మంచి గుర్తింపును సంపాదించుకోగలుగుతారు. మరి కొంతమంది వరుసగా సినిమాలు చేసిన పెద్దగా గుర్తింపు రాదు. అటువంటి హీరోయిన్స్ లో ఇప్పుడు చెప్పుకోబోయే బ్యూటీ కూడా ఒకరు. బ్యూటిఫుల్ నివేదా పెతురాజ్ ఒకరు.
ఈ ముద్దుగుమ్మ గత కొంతకాలం నుంచి వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ పెద్దగా గుర్తింపు రావడం లేదు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ ప్రేమించి మోసపోయా అంటూ కామెంట్స్ చేసింది. తొందరపడి లవ్ లో పడద్దని నేటి యూత్ కు సలహా ఇచ్చింది కూడా. నిజానికి తను చిట్ అవ్వబోతున్నానని కలలో వచ్చిందని ముఖ్యంగా తన ఫ్రెండ్ తన లవర్ ను సెట్ చేసుకుంటుందని.. జాగ్రత్తగా ఉండాలని డ్రీమ్ చెప్పినా పట్టించుకోలేదని తెలిపింది.
కానీ నిజంగానే అది జరిగిందని చెప్పుకొచ్చింది. దీంతో కొన్ని నెలలు చాలా డిస్టర్బ్ అయ్యానని కూడా ఓ ఇంటర్వ్యూలో బాధపడింది. ఇక తనకు ఒక్కోసారి సూపర్ నాచురల్ పవర్ ఉన్నాయేమో అనిపిస్తుంది అంటూ తెలిపింది. ఎందుకంటే తాను ఎప్పుడూ ఏ కారు కొంటాను కూడా కలలో వచ్చినట్లే నిజ జీవితంలోనూ జరుగుతుందని తెలిపింది. ప్రజెంట్ ఈమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.