Star heroine emotional post

Heroine: బాలీవుడ్ భామ సోనాలి బింద్రే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకానొక సమయంలో టాలీవుడ్ అండ్ బాలీవుడ్ ని షేర్ చేసిన ఈమె ప్రజెంట్ పెద్దగా సినిమా అవకాశాలు లేక ఇంటికే పరిమితమైపోయింది. ఈమె తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గర.

ఇంద్ర, మన్మధుడు, ఖడ్గం లాంటి చిత్రాల్లో నటించి ప్రతి ఒక్కరి హృదయాలను గెలుచుకుంది ఈ బ్యూటీ. ఇక అనంతరం హిందీ ఇండస్ట్రీలో బిజీ అయిపోయింది. ఇక పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది ఈ బ్యూటీ. అయితే కొద్ది రోజులు ఫ్యామిలీతో ఆనందంగా గడిపిన ఈమెకు క్యాన్సర్ ఉందనే విషయం తెలిసి చాలా బాధపడిపోయింది. ట్రీట్మెంట్ కోసం ఫారెన్ వెళ్ళింది కూడా.

Star heroine emotional post

కానీ సర్వైవల్ 35 శాతం మాత్రమే అని చెప్పారట డాక్టర్స్. అయినా సరే 100% పోరాడిన హిమేం మొత్తానికి బ్రతికి చూపించింది. ప్రస్తుతం క్యాన్సర్ నుంచి బయటపడి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. అటు షోస్ కి జడ్జ్ గా ఇటు ఓటిటి ప్రాజెక్ట్ లతో బిజీగా గడుపుతుంది. ఇక ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది సోనాలి బింద్రే.