Roja: ఏంటి హీరోయిన్,మాజీ మంత్రి అయినటువంటి రోజాకి భర్తతో విభేదాలా. అంత గొడవలు అయ్యే పని ఏం జరిగింది.. ఇద్దరి మధ్య నిజంగానే ఆ స్టార్ హీరో వల్ల విభేదాలు తలెత్తాయా ఇంతకీ అసలు విషయం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. స్టార్ హీరోయిన్గా ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీని ఏలిన రోజా కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా స్టార్ నటిగా కొనసాగింది. అలాంటి ఈ ముద్దుగుమ్మ రాజకీయాల్లోకి వచ్చి కూడా తనదైన మార్క్ చూపించింది.
Roja differences with her husband
ఎమ్మెల్యేగా మంత్రిగా ఎన్నో మంచి పనులు చేసింది.అయితే అలాంటి రోజా ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిపాలైంది. ఈమె మాత్రమే కాదు వైసిపి పార్టీ మొత్తం పూర్తిగా టిడిపి కూటమి హవాకి కొట్టుకుపోయింది. దీంతో రోజా అటు సినిమాలకు ఇటు రాజకీయాలకు రెంటికి చెడ్డ రేవడిలా మారిపోయింది. ఎందుకంటే రోజా మంత్రిగా అయ్యాక సినిమాలకు షోలకు అన్నింటికీ స్వస్థి చెప్పింది. ( Roja)
Also Read: Alekhya Reddy: తారకరత్న చనిపోయినా కోడల్ని దగ్గరికీ తీయని నందమూరి ఫ్యామిలీ.. దీనస్థితిలో అలేఖ్య.?
ఇదంతా పక్కన పెడితే గతంలో రోజా భర్త చేసిన పనికి ఇద్దరి మధ్య గొడవలు జరిగాయట. అదేంటంటే.. రోజా భర్త తమిళ్ డైరెక్టర్ సెల్వమణి అందరికీ తెలుసు.అయితే ఈయన గతంలో తమిళ్ లో స్టార్ డైరెక్టర్లలో ఒకరు.అయితే అలాంటి డైరెక్టర్ సెల్వమణి హీరోగా సుమన్ ని పెట్టి భర్త సమరం అనే సినిమాని తీశారు. ఈ సినిమాకి నిర్మాతగా రోజా వ్యవహరించింది.
అయితే భారీ ఎక్స్పెక్టేషన్ తో ఈ సినిమాని కి ఎంతో బడ్జెట్ పెట్టి రోజా నిర్మించినప్పటికీ సినిమా మొదటి రోజే నెగటివ్ టాక్ తెచ్చుకొని పూర్తిగా డిజాస్టర్ అయింది.దాంతో ఈ సినిమా వల్ల రోజా కోట్లు నష్టపోయిందట. అలా భర్త వల్ల కోట్ల రూపాయలు నష్టపోయి రోజాకి సెల్వమణికి మధ్య కొన్ని రోజులు గొడవలు కూడా జరగాయట.a తర్వాత కొద్ది రోజులకు ఆ గొడవలు అన్నీ సర్దుమనిగాయట.( Roja)