Lavanya: రాజ్ తరుణ్ వ్యవహారం మీడియాలో ఎంత దుమారం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లావణ్య మాటని బట్టి చూస్తే హీరోలు ఇలా ఉంటారా అని అనుకుంటారు. కానీ రాజ్ తరుణ్ మాటలు వింటే మాత్రం లావణ్య తప్పు ఉందని అనిపిస్తుంది. ఇలా ఎవరి మాటలు వింటే ఆపోజిట్ వారిదే తప్పు అనిపిస్తుంది. అయితే తాజాగా ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో లావణ్య మాట్లాడుతూ రాజ్ తరుణ్ కి చాలామందితో ఎఫైర్స్ ఉన్నాయి.
Lavanya: Malvi Malhotra’s character is bad
నేను మా పేరెంట్స్ ఒప్పుకోకపోయినా రాజ్ తరుణ్ ని గుళ్లో రహస్యంగా పెళ్లి చేసుకున్నాను.మా ఇద్దరి మధ్య 11 ఏళ్లుగా రిలేషన్ కొనసాగుతోంది.అలాగే మా ఇద్దరి మధ్య గొడవలు లవర్ మూవీ టైం నుండి ఏర్పడ్డాయి.కానీ ఎప్పుడైతే మాల్వి మల్హోత్రా కలిసిందో అప్పటినుండి రాజ్ తరుణ్ నన్ను దూరం పెట్టారు.గత ఐదు నెలల నుండి నాతో ఉండడం లేదు.డబ్బు కోసమే నేను ఇదంతా చేశాను అనే దాంట్లో ఎలాంటి నిజం లేదు. నేను మస్తాన్ సాయితో తిరిగాను అంటూ అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. ఎవరితో తిరిగినా కూడా అలాంటి రిలేషన్ అంట గట్టేస్తారా.. (Lavanya)
Also Read: Raj Tarun: రాజ్ తరుణ్ పై పగ పెంచుకున్న నిర్మాత.. అందుకే లావణ్యతో కేసు పెట్టించాడా.?
మస్తాన్ సాయిపై కేసు పెట్టాను అంటే మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది కాబట్టి కేసు పెట్టాను. రాజ్ తో నాకు జరిగిన ప్రతి ఒక్కదానికి ఆధారాలు ఉన్నాయి. అలాగే మాల్వి మల్హోత్రా ప్రస్తుతం రాజ్ తరుణ్ తో ఎఫైర్ నడిపిస్తుంది. కానీ మాల్వి మల్హోత్రా క్యారెక్టర్ మంచిది కాదు. ఈ విషయం నాకు తెలుసు. ఆమె గతంలో తన బాయ్ ఫ్రెండ్ ని నమ్మించి మోసం చేసింది.చివరికి చేతులు కట్ చేసుకుని తన బాయ్ ఫ్రెండ్ తన చేతులు కట్ చేశాడని కంప్లైంట్ ఇచ్చింది. మాల్వి క్యారెక్టర్ మంచిది అయితే నేను వారిద్దరి ఇష్ట ప్రకారమే వదిలేసి వెళ్లిపోయే దాన్ని.
కానీ ఆమె క్యారెక్టర్ మంచిది కాదు ఈ కారణంతోనే నేను రాజ్ కోసం పోరాటం చేస్తున్నాను రాజ్ నాకు కావాలి. మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఇండస్ట్రీలో చాలామందికి తెలుసు. వరుణ్ సందేశ్,నిఖిల్ వంటి హీరోలకు నన్ను తన భార్యగా గర్ల్ ఫ్రెండ్ గా పరిచయం చేశాడు. అలాగే రాజ్ తరుణ్ మేనేజర్ రాజా రవీంద్ర కి కూడా నేను తెలుసు. నేను ఆయన గురించి ఈ విషయం అడుగుతున్నానని రాజా రవీంద్ర ఫోన్లో నా నెంబర్ బ్లాక్ చేశారు. రాజ్ పేరెంట్స్ కూడా నేను కాల్ చేస్తే రెస్పాండ్ అవ్వడం లేదు. ఇండస్ట్రీలో ఉన్న చాలామందికి నేను పరిచయమే.కానీ ఎవరు కూడా నేను చేసిన మెసేజ్ కి కూడా స్పందించడం లేదు అంటూ లావణ్య సంచలన కామెంట్స్ చేసింది.(Lavanya)