Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ అత్యంత దారుణంగా ఓడిపోయి ప్రతిపక్ష హోదాను కూడా… సాధించుకోలేకపోయింది. ఈ తరుణంలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం… అడుగడుగునా జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూనే ఉంది. అక్రమ కేసులు పెట్టడం… వైసీపీ కార్యాలయాలను కూల్చడం… అటు వైసిపి నేతలను జైలుకు పంపడం జరుగుతుంది. Jagan
jagan will resign for mla post in pulivendula
అయితే తెలుగుదేశం కూటమి దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో… వైయస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. అతి త్వరలోనే పులివెందుల ఎమ్మెల్యే పదవికి… జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నారట. ఈ మేరకు రంగం సిద్ధం చేశారట జగన్మోహన్ రెడ్డి. ఏపీలో ప్రతిపక్ష హోదా… వైసీపీ పార్టీకి ఇవ్వమని టిడిపి స్పష్టం చేసింది. అలాగే… జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తే అక్కడ ఆయనను ట్రోలింగ్ చేయడం గ్యారంటీ. Jagan
Also Read: Chandrababu: బాబుతో మీటింగ్… తెలంగాణ ద్రోహిగా రేవంత్ రెడ్డి?
ఇలాంటి నేపథ్యంలో ఐదు సంవత్సరాలపాటు అసెంబ్లీకి వెళ్లకూడదని జగన్మోహన్ రెడ్డి ఈ స్కెచ్ వేశారట. పులివెందుల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి… కడప ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారట. కడప ఎంపీగా ప్రస్తుతం… అవినాష్ రెడ్డి ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆయనతో రాజీనామా చేయించనున్నారట జగన్. దీంతో కడప ఎంపీ ఇటు పులివెందుల ఎమ్మెల్యే పదవుల కోసం ఉప ఎన్నికలు రానున్నాయి. Jagan
అలా జరిగితే జగన్మోహన్ రెడ్డి కడప ఎంపీగా పోటీ చేసి… పార్లమెంటుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారట. ఇక ఇటు పులివెందుల నియోజకవర్గం నుంచి… తన తల్లి విజయమ్మను బరిలో దింపేందుకు సిద్ధమవుతున్నారట జగన్. ఆమె కాదంటే వైయస్ భారతిని ఎమ్మెల్యేగా నిలబెట్టనున్నారట. కడప ఎంపీగా గెలిచిన తర్వాత ఐదు సంవత్సరాల పాటు జగన్… అసెంబ్లీకి పోనవసరం లేదు. ఇక ఐదు సంవత్సరాల తర్వాత మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారట జగన్. Jagan