Modi: ప్రధాని నరేంద్ర మోడీ దాదాపు 5 ఏళ్ల తరవాత మళ్ళీ మిత్ర దేశం రష్యా పర్యటనకు వెళ్లబోతున్నారు. అయితే ఈ పర్యటనను రష్యా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. మోడీ పర్యటన నేపథ్యంలో రష్యా విస్తృత ఏర్పాట్లను చేస్తోంది. జూలై 8 నుండి 9 దాకా ప్రధాని మోస్కోలో ఉండబోతున్నారు. దేశాలకు సంబంధించిన కీలక ఒప్పందాలు జరిగే అవకాశం కనబడుతుంది. ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడుతున్నాయి అయితే ఇదిలా ఉంటే మోడీ రష్యాలో పర్యటించడానికి చూసి వెస్ట్రన్ దేశాలు అసూయ పడుతున్నాయని క్రేమిలిన్ వ్యాఖ్యానించింది. 22వ భారత రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి పుతిన్ ఆహ్వానం మేరకు రష్యా వెళ్లబోతున్నారు.
Modi Russia tour
ప్రధాన నరేంద్ర మోడీ 2022లో ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత మోడీ రష్యాలో పర్యటించడం ఇదే మొదటిసారి. మాస్కోలో ప్రధాని నరేంద్ర మోడీ కార్యక్రమం విస్తృతంగా ఉంటుందని ఇరువురి నేతలు అనధికారికంగా చర్చలు జరపచ్చని క్రేమిలిన్ ప్రతినిధి డిమ్రుతి పెస్కో రష్యా ప్రభుత్వ ఆధ్వర్యంలోని విసిటీఆర్కే టీవీకి శనివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
Also read: Lavanya: మాల్వి మల్హోత్రా క్యారెక్టర్ బ్యాడ్.. నిఖిల్ వరుణ్ సందేష్ లకు కూడా ఈ విషయం తెలుసు..?
రష్యా భారత్ సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామి స్థాయిలో ఉన్నాయని క్రిమిలిన్ లో ఇరువురు నేతలు విడిగా చర్చించుకోవడంతో పాటుగా ప్రభుత్వంతో కూడిన చర్చలు జరుగుతాయని ఆయన చెప్పారు. భారత రష్యా సంబంధాల్లో కీలకమైన పర్యటనగా పెస్కో అభివర్ణించారు. ప్రధాన నరేంద్ర మోడీ రాకను పశ్చిమ దేశాలు అసూయతో చూస్తున్నాయని అన్నారు. దాదాపు 5 ఏళ్ల క్రితం 2019లో ఓ ఆర్థిక సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ రష్యాకు వెళ్లారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఆయన ఐదేళ్లకు వెళ్తున్నారు. అలాగే మోడీ వెళ్లొచ్చాక పుతిన్ చివరిసారిగా 2021లో భారత్ కు వచ్చారు (Modi).