WhatsApp: ఈరోజుల్లో ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ ని ఉపయోగిస్తున్నారు. వాట్సాప్ వలన అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఈజీగా మనం ఒకరితో వీడియోలను ఫోటోలను షేర్ చేసుకోవడంతో పాటుగా అనేక లాభాలను పొందవచ్చు. వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను కూడా తీసుకు వస్తోంది. వాట్సాప్ అందిస్తున్న ఈ ఫీచర్స్ అందరికీ ఉపయోగపడతాయి వాట్సాప్ లో ఏఐ ఫీచర్ కూడా ఉంది. ఈ ఫీచర్ చాలామందికి ఉపయోగపడుతుంది. అయితే ఈ ఫీచర్ అవసరం లేని వాళ్ళు కావాలంటే ఆ ఫీచర్ ని తొలగించొచ్చు. అది ఎలా అనే విషయాన్ని చూద్దాం.. వాట్సాప్ లో మెటా అందింస్తున్న ఈ ఫీచర్ అందుబాటులో ఉంది బ్లూ కలర్ లో రౌండ్ షేప్ లో ఉన్న ఐకాన్ పై క్లిక్ చేయగానే ఓపెన్ అవుతుంది.
WhatsApp AI feature can be removed like this
ఇందులో మీకు కావాల్సిన సమాచారాన్ని మీరు పొందవచ్చు అయితే అందరికీ ఈ ఫీచర్ అక్కర్లేదు, ఈ ఫీచర్ అవసరం లేదు అనుకుంటే ఇలా తొలగించొచ్చు. ఇందుకోసం ముందుగా మీరు వాట్సాప్ ని ఓపెన్ చేయాలి. ఆ తర్వాత కుడివైపు ఉండే మూడు చుక్కల్ని సెలెక్ట్ చేసుకుని అందులో సెట్టింగ్స్ ఆప్షన్ లోకి వెళ్ళాలి. తర్వాత సెట్టింగ్స్ మెన్ చాట్స్ ని ఎంచుకోవాలి తర్వాత చాట్ సెట్టింగ్ మెనూ ఓపెన్ చేసాక చాట్ బ్యాక్అప్ పై క్లిక్ చేయాలి.
Also read: Modi: మోదీ రష్యా పర్యటనపై పాశ్చాత్య దేశాల అసూయ..!
వాట్సాప్ చాట్ ను ఎందులో బ్యాకప్ చేయాలనుకుంటున్నారో ఆ గూగుల్ అకౌంట్ ని ఎంచుకోండి. చాట్ బ్యాకప్ పూర్తయిన తర్వాత వాట్సాప్ యాప్ ని తీసేయండి. ఆ తర్వాత బ్రౌజర్ లో వాట్సాప్ వెర్షన్ 2.24.8.4 పాత వర్షిని ఎంచుకునే డౌన్లోడ్ చేసుకోవాలి తర్వాత సాధారణంగానే మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి దీంతో మెటా ఏఐ పిక్చర్ తొలగిపోతుంది. ఒకవేళ మీరు తిరిగి ఏఐ టూల్ ని పొందాలి అనుకుంటే మళ్ళీ లేటెస్ట్ వెర్షన్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు (WhatsApp).