Heroine: ప్రముఖ నటి నేహా ధూపియ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈమె ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు తీసిన సంగతి తెలిసిందే. ప్రముఖ నాటి, మోడల్ నేహా ధూపియా ‘ నింజా ఓడూరు’ అనే జరనీస్ మూవీతో సినీ కెరియర్ ప్రారంభించింది. తరువాత తెలుగులో ‘ నిన్నే ఇష్టపడ్డాము, విలన్, పరమ వీర చక్ర, వంటి సినిమాలు చేసి అలరించింది.
అయితే..ప్రజెంట్ ఈ బ్యూటీ ‘బ్యాడ్ న్యూస్ ‘ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. త్రిప్తి దిమ్రి, విక్కి కౌశల్, అమ్మి విరాక్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా..తన ఫిట్ నెస్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. పెళ్లై పిల్లలు పుట్టిన తర్వాత ఎక్కువగా బరువు పెరిగిన నేహా ధూపియా..దాదాపుగా 23 కిలోల బరువు తగ్గి అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ విషయం గురించి తాజా గా ఇంటర్వ్యూలో చెబుతూ..’2018లో అంగద్ బేజీని పెళ్ల చేసుకున్నారు.
ప్రజెంట్ ఇద్దరు పిల్లలకు తల్లిని..డెలివరీ తర్వాత ఫిట్ నెస్ గురించి ఆలోచించలేదు. పిల్లలకు ఏడాది వచ్చేవరకు పాలిచ్చాను. ఫిట్ నెస్ పై ఫోకస్ పెట్టకపోవడంతో 25 కోలోల బరువు పెరిగాను. తరువాత ఆఫర్లు తగ్గుముఖం పట్టాయి. ఇక ఫిట్ నెస్ పై దృష్టి పెట్టి ఏకంగా 23 కిలోలు తగ్గాను. దీనికోసం ఎక్కువగా కష్టపడలేదు. రోజు రన్నింగ్ చేసేదాన్ని. జిమ్ కి వెళ్లా. ఘగర్, ఫై లాంటివి డైట్లో లేకుండా చూసుకోవడంతో పాటు.. రాత్రి 7 గంటలకు డిన్నర్ పూర్తి చేసేదాన్ని. ఇప్పటికీ అదే ఫాలో అవుతున్న. బరువు తగ్గటంతో ఆఫర్లు కూడా వస్తున్నాయి’ అంటూ చెప్పుకొచ్చింది నేహా ధూపియా.