Kalki 2898 AD: ప్రొమోషన్స్ చేయడంలో ఒక్కొక్క దర్శకుడిది ఒక్కొక్క శైలి. కొంతమంది సినిమా విడుదలకు ముందు వరకు కథను స్పష్టంగా చెప్పకుండా నేరుగా థియేటర్‌లో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే ప్రయత్నం చేస్తారు. ఇంకొంతమంది కథను ముందుగానే స్పష్టంగా చెప్పి ప్రేక్షకులు ఏవిధంగా స్పందిస్తారో అని చూసే దర్శకులు కూడా ఉన్నారు. అలంటి ప్రమోషన్స్ కి రాజమౌళి ప్రసిద్ధి. అతని చాలా సినిమాల్లో కథ ముందుగానే అందరికి తెలుసు. ‘ఈగ’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ వంటి కొన్ని సినిమాల కథలను రాజమౌళి స్వయంగా విలేకరుల సమావేశంలో వెల్లడించిన సంగతి తెలిసిందే.
Kalki 2898 AD director Nag Ashwin Follows Rajamouli
మిగిలిన సినిమా కథను ట్రైలర్ రూపంలో చెప్పేవాడు. ఇప్పుడు యువ దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా రాజమౌళి లాంటి ప్రమోషన్ చేస్తున్నాడు. అయన చేసిన కల్కిలో ప్రేక్షకులకు కథను ముందుగానే చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటి వరకు విడుదలైన కల్కి ప్రోమోలు చూస్తుంటే కథపై ప్రేక్షకులు కాస్త కంగారు పడుతున్నారు. సినిమా కాన్సెప్ట్‌తో సహా కొన్ని ముఖ్యమైన విషయాలను విడుదలకు ముందు వదిలిపెట్టే ప్రయత్నం చేశాడు నాగి.(Kalki 2898 AD)
ముంబయిలో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఈ సినిమా కథను పూర్తిగా వివరించాడు నాగి. దానికితోడు యానిమేషన్ సిరీస్ లు, ఇంటర్వ్యూ లు అని మిగితా కథను పూర్తిగా చెప్పే పనిచేశాడు. ఏదేమైనా ఓ విజువల్ వండర్ ను తెరపై చూడడానికి ప్రేక్షకులు వస్తారని బలంగా నమ్ముతున్నాడు. వాస్తవానికి ఇలాంటి సినిమా ఇండియన్ స్క్రీన్ పై రావడం మొదటి సారె అని చెప్పాలి. మరి నాగి నమ్మకం నిజమవుతుందా అనేది చూడాలి.