Dhanush: ఏంటి రజినీకాంత్ ఇంట్లోకి వెళ్లాలంటే ధనుష్ సెక్యూరిటీని బతిమిలాడాలా ఇదెక్కడి విడ్డూరం.. అల్లుడు మామ ఇంటికి వెళ్లాలంటే అంత ఇబ్బంది పడాలా అంటూ చాలామంది కామెంట్లు పెడుతున్నారు. అయితే బిడ్డకు విడాకులు ఇచ్చాడు కాబట్టి అలా మాజీ అల్లుడ్ని ఇంటికి రానివ్వడం లేదని ఇంకొంత మంది అనుకుంటారు. అయితే రజినీకాంత్ ఇంటికి వెళ్లడానికి ధనుష్ సెక్యూరిటీని బతిమిలాడింది ఇప్పుడు కాదు. ఆయన రజినీకాంత్ ఇంటి అల్లుడు కాక ముందు.. ఇక అసలు విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం..
Dhanush: Rajinikanth has to pass security at the gate to go home
ధనుష్ దర్శకుడిగా హీరోగా చేస్తున్న ఆయన 50వ సినిమా రాయన్.ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ తాజాగా నిర్వహించారు చిత్ర యూనిట్.అయితే ఈ ఈవెంట్లో ధనుష్ తనపై వచ్చిన పుకార్లన్నింటి పై క్లారిటీ ఇచ్చారు.ఆయన మాట్లాడుతూ.. నా గురించి నా కుటుంబ సభ్యులకి నేను బాగా తెలిసిన వాళ్లకి అందరికీ తెలుసు. నేను ఏంటో మీకు ఇప్పుడు చెప్పనవసరం లేదు. మీ అందరికీ నా క్యారెక్టర్ ఎలాంటిదో తెలుసు. (Dhanush)
Also Read: Raj Tarun: రాజ్ తరుణ్ పై పగ పెంచుకున్న నిర్మాత.. అందుకే లావణ్యతో కేసు పెట్టించాడా.?
ప్రస్తుతం నేను ఇప్పుడు మీ ముందు ఉన్నానంటే దానికి నా అభిమానులే కారణం. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి బాడీ షేమింగ్ కామెంట్స్ ఎదుర్కొంటున్నాను. అలాగే నేను పోయిస్ గార్డెన్ లో ఇల్లు కట్టుకోవడానికి ప్రధాన కారణం పదహారేళ్ళ వయసులో ఉన్నప్పుడు రజినీకాంత్ ఉండే ఇల్లు పోయిస్ గార్డెన్ కి వెళ్ళడానికి ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చేది.నేను ఆయన ఇంటికి వెళ్లాలంటే సెక్యూరిటీని బతిమిలాడి వారి ఇల్లును చూడడానికి వెళ్లాల్సి ఉండేది.
ఇక ఆరోజే అనుకున్నాను. ఎప్పటికైనా పోయిస్ గార్డెన్ లో ఒక ఇల్లు నిర్మించుకోవాలి అని. ఇక ఆరోజు అనుకున్న కల ఇప్పుడు నిజమైంది. నేను పోయిస్ గార్డెన్లో ఒక ఇల్లు నిర్మించుకున్నాను.దాన్ని నా తల్లిదండ్రులకు బహుమతిగా ఇచ్చాను అంటూ ధనుష్ చెప్పారు. ఇక ధనుష్ పోయిస్ గార్డెన్ లో దాదాపు 150 కోట్లు పెట్టి తన ఇష్టానికి అనుగుణంగా స్పెషల్ గా డిజైన్ చేయించుకొని లగ్జరీ ఇల్లు కట్టుకున్న సంగతి మనకు తెలిసిందే.(Dhanush)