Heroine: కొంతమంది అదృష్టం కాళ్ల దాకా వచ్చిన కాదని తన్నేస్తూ ఉంటారు.అలాంటి వారిలో సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు ఎంతో మంది ఉంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరోయిన్ కూడా అంతే. ఎంతోమంది కోటీశ్వరుల సంబంధాలు పెళ్లి చేసుకుంటామని ముందుకు వచ్చారట. కానీ ఆ హీరోయిన్ మాత్రం ఒక మామూలు డైరెక్టర్ని పెళ్లి చేసుకొని జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడింది. మరి ఆ హీరోయిన్ ఎవరో అనుకుంటున్నారా..ఆమె ఎవరో కాదు ఒకప్పటి అందాల రాశి.
The Heroine who married the small director
ఈమె పేరు చెప్పగానే అందరికీ ప్రేయసిరావే, గోకులంలో సీత,పెళ్లిపందిరి, శుభాకాంక్షలు వంటి సినిమాలు గుర్తుకు వస్తాయి.రాశి ఎన్నో సినిమాల్లో తన అందంతో కుర్ర కారుని దాదాపు దశాబ్దం పాటు ఒక ఊపు ఊపింది.ఈమె ఎక్కువగా జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, శ్రీకాంత్ వంటి హీరోలతోనే నటించింది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ను పెళ్లి చేసుకోవడానికి ఎంతో మంది ధనవంతులు, వ్యాపారవేత్తలు ముందుకు వచ్చారట.కానీ రాశి మాత్రం ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ని పెళ్లి చేసుకుంది. రాశి డైరెక్టర్ శ్రీమునిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. (Heroine)
Also Read: Sree Ramachandra: ఆ అమ్మాయిని మోసం చేసిన సింగర్ శ్రీరామచంద్ర.. పెళ్లి చేసుకోమని ఇంటికే వచ్చి..?
అయితే రాశి పెళ్లాడిన సమయంలో ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ మాత్రమే. ప్రేమకు పేద ధనికా తేడా లేదు అన్నట్లు రాశి జీవితంలో కూడా ఇలాగే జరిగింది. అయితే ఓ సినిమా షూటింగ్ సమయంలో రాశికి అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీముని కి మధ్య పరిచయం ఏర్పడిందట.అది కాస్తా ప్రతిరోజు ఫోన్లు మాట్లాడుకునే వరకు వచ్చింది. అయితే ఆ టైంలో రాశి తండ్రి చనిపోవడంతో ఆమెకు ఎమోషనల్ గా దగ్గరయ్యాడు శ్రీముని.అలా ఇద్దరి మధ్య విడదీయలేని బంధం ఏర్పడింది. అయితే ముందుగా వీరి పెళ్లికి రాశి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోయినప్పటికీ వారి మాటలు కాదని రాశి పెళ్లాడింది.
ఇక రాశి శ్రీమునిని పెళ్లాడి ఒక పాప కూడా జన్మ నిచ్చింది. ప్రస్తుతం వీరి పెళ్ళై 20 ఏళ్లయినా కూడా ఎలాంటి గొడవలు లేకుండా ఎంతో అన్యోన్యంగా జీవితాన్ని గడుపుతున్నారు. అలా ప్రేమించిన వాడి కోసం రాశి ఎంత డబ్బున్న వాళ్ళ సంబంధాలు వచ్చినా కూడా పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాలేదు. ఇక రాశి పెళ్లయ్యాక చాలా లావైపోయింది ఆర్థిక ఇబ్బందుల ఎక్కువవ్వడంతో సినిమాల్లో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చిన్నచిన్న పాత్రల్లో కూడా నటించింది. చివరికి బుల్లితెర మీద జానకి కలగనలేదు అనే సీరియల్ లో కూడా చేసింది.(Heroine)