Kodali Nani: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో… కొడాలి నాని కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన మీడియా మీడియా ముందుకు వస్తే… చంద్రబాబు కుటుంబాన్ని తిట్టందే వదలరు. వైసిపి అధికారంలో ఉన్నన్ని రోజులు… ఆ కుటుంబాన్ని చీల్చి చెండాడారు మాజీ మంత్రి కొడాలి నాని. అయితే అలాంటి కొడాలి నాని… మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత దారుణంగా ఓడిపోయాడు. గుడివాడ నియోజకవర్గంలో కొత్త అభ్యర్థి చేతిలో… కొడాలి నాని ఓడిపోవడం జరిగింది.Kodali Nani
Kodali Nani sensational decision over politics big shock to jagan
వేముగంటి రాము చేతిలో కొడాలి నాని ఓడిపోయారు. అటు వైసిపి పార్టీ కూడా 11 స్థానాలకే పరిమితమై ప్రతిపక్ష హోదాను కూడా ఏపీలో కోల్పోవడం జరిగింది. వైసీపీ ఓటమి తర్వాత కొడాలి నాని లాంటి ఫైర్ బ్రాండ్ నేతలందరూ సైలెంట్ అయిపోయారు. ఇప్పటికే విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యులు కేశినేని నాని రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. Kodali Nani
Also Read: Jagan: ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా… అదిరిపోయే స్కెచ్ తో వైసీపీ?
అయితే తాజాగా కొడాలి నాని కూడా సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేశినేని నాని తరహాలోనే రాజకీయాలకు గుడ్ బై చెప్పే ఆలోచనలో మాజీ మంత్రి కొడాలి నాని ఉన్నారట. తెలుగుదేశం పార్టీ నేతలు పెడుతున్న వరుస కేసులు, ఇబ్బందులు… తట్టుకోలేక కొడాలి నాని రాజకీయాలకు దూరం కాబోతున్నారని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అయితే కొడాలి నాని ఆరోగ్యం గత కొన్ని రోజులుగా బాగుండటం లేదట. Kodali Nani
ఈ తరుణంలోనే రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నాడని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అయితే రాజకీయ సన్యాసం… ఇప్పుడే చేయడని.. మరో ఏడాది లేదా రెండు సంవత్సరాల లోపు కొడాలి నాని గుడ్ బై చెప్పే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. కష్టాల్లో ఉన్న వైసిపి పార్టీని…. ఇప్పుడే వదిలితే.. మరికొంతమంది లీడర్లు కూడా రాజకీయాలకు గుడ్ బై చెప్పే ప్రమాదం ఉంటుంది. అందుకే కొన్ని రోజులు ఆగిన తర్వాత ఆ నిర్ణయం తీసుకొని ఉన్నారట కొడాలి నాని. Kodali Nani