Sukumar: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అల్లు అర్జున్ ఎన్నో సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాడు. అలాగే తాజాగా పుష్ప మూవీ లో హీరోగా చేసి బ్లాక్ బస్టర్ హిట్టును అందుకున్నారు. ఇప్పుడు మళ్లీ పుష్ప 2 మూవీలో హీరోగా చేస్తున్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీస్ పథకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. రష్మిక కథానాయక, పుష్ప మొదటి భాగం తెలుగులో కన్నా ఎక్కువగా హిందీలో హిట్ అవటంతో రెండో భాగంపై అంచనాలు భారీగా ఉన్నాయి. దాదాపు రూ.400 కోట్లు బడ్జెట్ తో తరికెక్కుతోంది.
వాస్తవానికి ఆగస్టు 15వ తేదీన సినిమా విడుదల కావాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాలతో డిసెంబర్ ఆరోతేదీకి వాయిదా పడింది. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడం, కొన్ని సన్నివేశాలు అనుకున్న స్థాయిలో రాకపోవడంతో దర్శకుడు సుకుమార్ తిరిగి చిత్రీకరిస్తున్నారు. దీనికి బడ్జెట్ అనుకున్న దానికన్నా ఎక్కువగా అవుతుంది. ఇప్పటికే సినిమా విడుదల వాయిదా పడటంతో నిర్మాతలు ఆసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నాలుగు నెలలు వడ్డి ఖర్చు పెరుగుతుందని, తిరిగి మళ్లీ సన్నివేశాలు తీయాలంటే బడ్జెట్ భారీగా అవుతుండటంతో ఉన్న దాంతోనే సరిపెట్టుకుని, తక్కువ ఖర్చులో ఎక్కువ నాణ్యత వచ్చేలా తీయాలంటూ నిర్మాతలు సుకుమార్ కు తేల్చి చెప్పారు.
అయితే షూటింగ్ బడ్జెట్ను నిర్మాతలు కేటాయించకపోవడం, మరోవైపు కొన్ని సన్నివేశాల్లో నటులు ఎంత చెబుతున్నప్పటికీ తాను అనుకునే రీతిలో నటించకపోవడంతో ఎక్కువ టేకులు అవసర పడుతున్నాయి. దీనితో సుకుమార్ కూడా తీవ్ర ఆగ్రహనానికి లోనై కూర్చుని కాలితో తన్ని షూటింగ్ స్పాట్ నుంచి బయటకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. తెలుగు ఫిల్మ్ నగర్ లో ప్రస్తుతం ఈ వార్త చెక్కర్లు కొడుతోంది. సన్నివేశాలు చాలా పెద్దవాన్ని, వాటిని తీయాలంటే నటీనటులు కాల్షిట్లకు డబ్బులు చెల్లించటంతో పాటు చిత్రీకరణకు కూడా భారీ స్థాయిలో ఖర్చవుతోందని తెలుస్తోంది. మరి డిసెంబరు కన్నా ఈ సినిమా షూటింగ్ పూర్తివుతుందో లేదో సుకుమార్ కే తెలియాలి.