Masthan Sai revealed a sensational thing about Raj Tarun

Masthan Sai: మస్తాన్ సాయి…కొత్తగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ పేరు ఈపాటికే అందరికీ తెలిసే ఉంటుంది. గత నాలుగైదు రోజుల నుండి సోషల్ మీడియాలో,మెయిన్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా రాజ్ తరుణ్, లావణ్య ల వ్యవహారమే వినిపిస్తోంది కనిపిస్తోంది.. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి మ్యాటర్లోకి అటు హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో పాటు ఇటు మస్తాన్ సాయి అనే వ్యక్తి కూడా వచ్చారు.

Masthan Sai revealed a sensational thing about Raj Tarun

మాల్వి మల్హోత్రాతో రాజ్ తరుణ్ ఎఫైర్ పెట్టుకున్నాడు అని లావణ్య ఆరోపిస్తే మస్తాన్ సాయి అనే వ్యక్తితో లావణ్య ఎఫైర్ పెట్టుకుంది అని రాజ్ తరుణ్ ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఇద్దరి ఆరోపణంలో ఎవరిది కరెక్టో తెలియదు కానీ తాజాగా ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో లావణ్య రూమర్ బాయ్ ఫ్రెండ్ గా వినిపిస్తున్న మస్తాన్ సాయి రాజ్ తరుణ్ గురించి లావణ్య గురించి సంచలన విషయాలు బయటపెట్టారు.(Masthan Sai )

Also Read: Katrina Kaif: వేరే హీరోయిన్ తో భర్త ఎఫై** విడాకులు ఇచ్చి ఆ హీరోని పెళ్లి చేసుకోబోతున్న కత్రినా కైఫ్.?

మస్తాన్ సాయి మాట్లాడుతూ.. నేను లావణ్యతో ఎఫైర్ పెట్టుకున్నాను అని రాజ్ తరుణ్ ఆరోపించే మాటల్లో ఎలాంటి వాస్తవం లేదు. అసలు మా ఇద్దరి మధ్య రాజ్ తరుణ్ చెప్పే చెడు రిలేషన్ లేదు.అయితే మేమిద్దరం కాస్త సాన్నిహిత్యంగా ఉంటాం.ఈ విషయం రాజ్ తరుణ్ కి కూడా తెలుసు. అయినప్పటికీ మా మీద చెడు ప్రచారం చేస్తున్నారు.

Masthan Sai revealed a sensational thing about Raj Tarun

ఇక లావణ్య డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న సమయంలో ఆమెను కలవడానికి నేను వెళ్లి ఆ టైంలో చాలా ధైర్యం చెప్పాను. అలాగే మేమిద్దరం కలిసిన ప్రతి సారి సరదాగా కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం.కానీ లావణ్యను రాజ్ తరుణ్ ని విడదీయాలని నేను ఎప్పుడూ కూడా అనుకోలేదు. ఈ విషయం రాజ్ తరుణ్ కి కూడా తెలుసు. కానీ కావాలనే చెడు ప్రచారం చేస్తున్నాడు అంటూ రాజ్ తరుణ్ పై సంచలన కామెంట్స్ చేశారు మస్తాన్ సాయి.(Masthan Sai )