Deepika Padukone saree is very luxurious

Deepika Padukone: బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే ఈ మధ్యకాలంలో బేబీ బంప్ తో ఉన్న ఫోటోలు ఎన్నో షేర్ చేస్తూ సోషల్ మీడియాలో తన ఫొటోస్ తో అందరిని అలరిస్తోంది. ఈ మధ్యకాలంలోనే రీసెంట్ గా వైలెట్ కలర్ శారీలో బేబీ బంప్ తో మెరిసింది.అయితే తాజాగా దీపిక కట్టుకున్న ఆ వైలెట్ కలర్ సారీ తయారు చేయడానికి ఎన్ని గంటల సమయం పట్టిందో తెలుసా అంటూ ఒక వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.

Deepika Padukone saree is very luxurious

మరి ఇంతకీ దీపిక కట్టుకున్న ఆ చీర ధర ఎంత.. దాని బ్లౌజ్ ఎన్ని వేలు పెట్టి కొన్నది.. అలాగే ఆ సారీ తయారు చేయడానికి ఎన్ని వేల గంటల సమయం పట్టింది అనేది ఇప్పుడు చూద్దాం. దీపిక పదుకొనే రీసెంట్గా వైలెట్ కలర్ శారీలో బేబీ బంప్ తో మెరిసింది.అయితే ఈ ఫోటోలో ఉన్న సారీ తయారు చేయడానికి ఏకంగా 3,400 గంటల సమయం పట్టిందట.(Deepika Padukone)

Also Read: Dhanush: రజినీకాంత్ ఇంటికి వెళ్లాలంటే గేటు దగ్గర సెక్యూరిటీని బతిమాలాలి..!!

అయితే ఈ చీర ఎంబ్రాయిడరీ మొత్తం చేతితో చేయడం వల్ల అన్ని గంటల సమయం పట్టిందని తెలుస్తోంది.ఈ వైలెట్ కలర్ శారీలో ముత్యాలు, జరీ తీగలు సారీ కి మరింత అందాన్ని ఇచ్చాయి. అలాగే చీరకు తగ్గట్టు బ్లౌజ్ దానికి తగ్గ నెక్ చౌకర్ దీపిక పదుకొనేని మరింత అందంగా మలిచాయి.

Deepika Padukone saree is very luxurious

అయితే ఈ బ్యూటీ కట్టుకున్న చీర ధర అక్షరాల 1,39,500.. ఈ ధర కేవలం చీరకు మాత్రమే. ఇక ఆమె ధరించిన బ్లౌజ్ ధర 46,500 అలాగే శారీ లోపల కట్టుకున్న పెట్టికోట్ ధర 7500..ఇలా మొత్తంగా దీపిక పదుకొనే కట్టుకున్న చీర, బ్లౌజ్ ధర పూర్తిగా 1,93,500 లని తెలుస్తోంది.(Deepika Padukone)