Who is the star hero who was beaten what Balakrishna did

Balakrishna: ఎవరైనా హీరోలను చూస్తే అభిమానులు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు.అలా వెళ్ళిన సమయంలో హీరోలు వారితో సెల్ఫీలు, ఆటోగ్రాఫ లు ఇస్తూ ఉంటారు. కానీ ఈ హీరో ని చూస్తే మాత్రం అభిమానులు భయపడిపోతారు. ఎందుకంటే సడన్గా హీరో వచ్చాడు కదా అని పరిగెత్తితే వారి పని అంతే..వచ్చిన వారిని వచ్చినట్టు కొట్టేస్తాడు.ఇక ఇప్పటికే ఆయన ఎవరో మీకు అర్థమై ఉంటుంది.ఆయనే నందమూరి బాలకృష్ణ. అయితే ఇప్పటికే బాలకృష్ణ ఎంతోమంది అభిమానులపై ఫైర్ అయ్యి వారిపై చేయి చేసుకున్న వార్తలు మనం చూసాం.

Who is the star hero who was beaten what Balakrishna did

అయినప్పటికీ బాలకృష్ణ పై అభిమానులకు చచ్చేంత ప్రేమ ఉంటుంది. అయితే బాలకృష్ణని చూస్తే ఇండస్ట్రీలో ఉన్న చాలా మందికి కూడా భయం వేస్తుంది.కానీ అలాంటి బాలకృష్ణ ఓ హీరో ని చూసి హడలెత్తి పోతారట. అంతే కాదు ఆ హీరో బాలకృష్ణని ఓ రోజు పరిగెత్తించుకుంటూ కొట్టారట.మరి ఇంతకీ ఆయన ఎవరా అనుకుంటున్నారా.. ఆయన ఎవరో కాదు నందమూరి హరికృష్ణ బాలకృష్ణ అన్నయ్య.. అయితే నందమూరి తారక రామారావు బయోపిక్ కథానాయకుడు మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో బాలకృష్ణ మాట్లాడుతూ.. (Balakrishna )

Also Read: Namrata: యంగ్ హీరో మూవీ తో టాలీవుడ్ లోకి నమ్రత రీ ఎంట్రీ.. ఖుషి లో ఫ్యాన్స్.?

మా ఇంట్లో నేను మా నాన్నకి కూడా భయపడను. కానీ హరికృష్ణ అన్నయ్యకు మాత్రం చాలా భయపడతాను. నేను మాత్రమే కాదు మా నాన్న కూడా భయపడే ఏకైక వ్యక్తి మా అన్న హరికృష్ణ నే.. ఇక అప్పట్లో మా అన్నయ్య తాత ఇద్దరు కలిసి పొలం పనులు చేసేవారు. అలా ఓ రోజు నేను పొలం దగ్గరికి వెళ్లిన సమయంలో ఎలా ఉంది మన పొలం అని అన్నాను. దాంతో మా అన్నయ్య హరికృష్ణ చాలా కోపానికి వచ్చి ఏంటి ఏమన్నావ్ రా మన పొలమా? అంటూ ఇంటి వరకు పరిగెత్తించుకుంటూ మరీ నన్ను మిగతావారందరినీ కొట్టాడు.. అంతేకాదు నువ్వేమైనా నారు పోసావా.. పొలం దున్నావా..

Who is the star hero who was beaten what Balakrishna did

కోత కోసావా.. నువ్వేం పొలం పనులు చేశావురా నీకు పొలంపై ఏం హక్కు ఉందిరా.. కష్టపడి పని చేసింది నేను తాతయ్య అంటూ హరికృష్ణ కోపంగా అన్నారు.ఇక ఆ సమయంలో తాతయ్య కూడా హరికృష్ణ వైపే ఉంటూ అవును వాడు చెప్పింది నిజమే.. పని చేసేది నేను వాడే అని అన్నయ్య వైపే తాత కూడా మాట్లాడాడు అంటూ బాలకృష్ణ గుర్తు చేసుకున్నారు.అంతే కాదు హరికృష్ణ అన్నయ్య చాలా మొరటు మనిషి.ఆయన ఏ పనైనా సరే క్షణాల్లో పూర్తి చేసేవారు. మా ఫ్యామిలీలో రెబల్ అంటే హరికృష్ణ అన్నయ్యే అంటూ బాలకృష్ణ చెపుకొచ్చారు.(Balakrishna )