Tata Motors: ఇండియన్ మార్కెట్లో అనేక రకాల వాహనాల కంపెనీలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో టాటా కంపెనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశవ్యాప్తంగా టాటా మోటార్స్ నుంచి రిలీజ్ అయిన.. కార్లకు విపరీతంగా డిమాండ్ ఉంటుంది. అత్యంత సేఫ్టీ కార్లలో టాటా మోటార్స్ ఒకటి. Tata Motors
Huge discounts on Tata Motors Offer up to 1.40 lakhs
అయితే తాజాగా టాటా కంపెనీకి చెందిన టాటా పంచ్, టాటా హారర్, టాటా నెక్సన్, టాటా సఫారీ, టాటా సియారా లాంటి ఎస్ యు వి కార్ల… విక్రయాలు 20 లక్షల మైలురాయిని దాటాయి. ఇలాంటి నేపథ్యంలో టాటా మోటార్స్ అదిరిపోయే ప్రకటన చేసింది. 20 లక్షల విక్రయాలు జరిగిన నేపథ్యంలో… ఈ కార్లపై 1.40 లక్షల వరకు డిస్కౌంట్లు ప్రకటించింది టాటా మోటార్స్. Tata Motors
Also Read: Electric Scooter: భారత్లో మరో ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల..85 KM మైలేజ్
ఇందులో టాటా హారియర్ suv కారు ఎక్స్ షోరూం ధర దాదాపు 15 లక్షలు గా ఉంది. అటు టాటా సఫారీ… ఎక్స్ షోరూం ధర కూడా 15.50 లక్షలు వరకు పలుకుతోంది. అయితే ఈ రెండు మోడల్ కార్లపై.. 1.40 లక్షల వరకు… డిస్కౌంట్ ప్రకటించింది టాటా మోటార్స్. Tata Motors
ఇక టాటా నెక్సన్ ఎలక్ట్రానిక్ కారుపై…1.30 లక్షల వరకు డిస్కౌంట్ ఇచ్చింది. ఇటు టాటా పంచ్ కారుపై 30 వేల రూపాయల వరకు డిస్కౌంట్ ఇస్తోంది. అయితే ఈ నెల 31వ తేదీ వరకు ఫ్రీ బుకింగ్స్… ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈ డిస్కౌంట్ ఆఫర్ ఉంటుందని కంపెనీ వెల్లడించింది. Tata Motors