CMF Phone 1: స్మార్ట్ ఫోన్ల వాడకం రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతుంది. గత కొన్ని రోజుల నుంచి ప్రతి ఒక్కరి చేతిలో 5జి మొబైల్ ఫోన్లు కనిపిస్తున్నాయి. ఈ ఫోను అతితక్కువ ధరకే కొనుగోలుకు రావడంతో ప్రతి ఒక్కరు వాటిని కొనేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా…. సిఎంఎఫ్ ఫోన్ 1 భారత మార్కెట్లోకి లాంచ్ అయ్యింది. CMF Phone 1

CMF Phone 1 launched in India

ఇక ఈ ఫోన్ ను అతి తక్కువ ధరకే మార్కెట్లోకి తీసుకువచ్చారు. ఇక ఈ ఫోన్లో ఫీచర్ల విషయానికి వస్తే…..6 జిబి రామ్, 128 జీబీ స్టోరేజ్ తో రూ.19, 999 కాగా…. ఆఫర్లో భాగంగా 20% డిస్కౌంట్ తో రూ. 15, 999కే లభించనుంది. 8 జిబి రామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ తో రూ. 21,999 కే లభించనుంది. ఆఫర్లో భాగంగా రూ. 17, 999 లభిస్తుంది. అంతేకాకుండా పలు రకాల బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 1000 రూపాయలు అదనంగా డిస్కౌంట్ పొందవచ్చు. CMF Phone 1

Also Read: Motorola Edge 50 Pro: అదిరిపోయే కలర్‌లో మోటరోలా.. ధర, ఫీచర్స్..!

అంటే ఈ ఫోన్ రూ. 16, 999కే సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ ఫోన్లో 6.67 ఇంచెస్ తో కూడిన ఫుల్ హెచ్డి డిస్ప్లేను అందించారు. దీనిని స్టయిలింగ్ లుక్ లో డిజైన్ చేశారు. ఈ స్మార్ట్ ఫోన్ డైమెన్సిటీ 7300 5జీ ప్రాసెసర్ తో పనిచేయనుంది. ఇక ఇందులో బ్యాటరీ విషయానికొస్తే….5000 ఎంఎహెచ్ బ్యాటరీని అమర్చారు. CMF Phone 1

120hz రిఫ్రెష్ రేటుతో ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేస్తుంది. ఇక ఇందులో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగా పిక్సెల్స్ తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఏర్పరిచారు. ఇక ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో లిస్టింగ్ చేశారు. అయితే మొదటి సేల్ ఎప్పుడు ప్రారంభమవుతుంది అన్న దానిపై క్లారిటీ ఇవ్వలేదు. కమింగ్ సూన్ అని ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ లిస్ట్ అయ్యింది.