Does Mamita have this talent

Mamitha Baiju: తెలుగు సినీ పరిశ్రమలో మలయాళీ హీరోయిన్లకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆల్ మోస్ట్ కేరళ అమ్మాయిలే చక్రం తిప్పేస్తున్నారు. ఒక సినిమా తోనే అందం, అభినయంతో కుర్రాళ్ల హృదయాలను దోచేస్తున్నారు. ఇప్పటికే తెలుగు తెరపై ఓ రేంజ్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోయిన్స్ అంతా మలయాళ ముద్దుగుమ్మలు కావడం విశేషం. అందులో మమిత బైజు ఒకరు. దశాబ్ద కాలంగా మలయాళం లో పలు సినిమాలు చేసిన ఈ బ్యూటీ..ఒక్కసారిగా ప్రేమలు సినిమాతో సెన్సేషన్ అయ్యింది.

మలయాళం లో బ్లాక్ బస్టర్ హిట్ అయినా ఈ సినిమాను తెలుగులోకి డబ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ సినిమా సక్సెస్ కాగా..దక్షణాదిలో మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది మమితా. ఈ సినిమాలో రీను పాత్రలో మమితా నటనకు, క్యూట్ నెస్ చూసి ఫిదా అయిపోయారు. ఇంకా అబ్బాయిలకు మమితా ఫేవరేట్ అయిపోయింది. ప్రేమలు సినిమా తరువాత మమితా ఫాలోయింగ్ అమౌంట్ గా పెరిగిపోయింది. ముఖ్యంగా అబ్బాయిలలో ఓ రేంజ్ క్రేజ్ వచ్చేసింది. దీనితో ఇటు తెలుగులోనూ ఈ బ్యూటీ కి అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే మమితా తెలుగుతో పాటు తమిళంలోనూ వరుస ఆఫర్స్ వస్తున్నాయని టాక్.

Does Mamita have this talent

అలాగే సోషల్ మీడియాలో మమితా ప పోస్ట్ చేసిన క్షణాల్లో వైరల్ అవుతుంది. ఈ బ్యూటీ చైల్డ్హుడ్ ఫొటోస్ , వీడియోస్ తెగ షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలో తాజాగా మమితా సంబంధించిన ఓల్డ్ వీడియో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. కొన్నాళ్ల క్రితం ఓ ఈవెంట్లో చీరకట్టులో మెరిసింది మమితా. అలాగే గురు సినిమాలో ఐశ్వర్య రాయ్ చేసిన బర్సోరే మేఘ పాటకు ఎంతో అందంగా డాన్స్ చేసి అందరిని ఫిదా చేసింది. ప్రస్తుతం ఆమె డాన్స్ వీడియో నెట్టిండా వైరల్ గా మారింది. ఇంత క్యూట్ గా డాన్స్ చేసిందేంటి.? ఎంత బాగా డాన్స్ చేసిందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు నేటిజన్స్.